Ram Charan పుట్టినరోజు కి విష్ చెయ్యని అల్లు అర్జున్.. ఇంత కుళ్ళు ఎందుకు!

- Advertisement -

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పుట్టిన రోజు కానుకగా ‘ఆరెంజ్’ మూవీ స్పెషల్ షోస్ వేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోయ్యే రేంజ్ రికార్డ్స్ ని నెలకొల్పారు.మరో పక్క శంకర్ తో ప్రస్తుతం చేస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చెయ్యగా వాటికి ఫ్యాన్స్ నుండి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది.

Ram Charan
Ram Charan

ఇక తన తోటి స్టార్ హీరోలైన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబు రామ్ చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు.వీళ్ళతో పాటుగా యంగ్ హీరోలు మరియు హీరోయిన్లు ఇలా అందరూ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలను రామ్ చరణ్ కి తెలియజేసి తమ అభిమానం ని చాటుకున్నారు.

Ram

అందరూ చెప్పారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు విష్ చెయ్యలేదు.ఇక ఈరోజు విష్ చేస్తాడనే నమ్మకం కూడా లేదంటున్నారు ఫ్యాన్స్.గతం లో ప్రతీ ఏడాది అల్లు అర్జున్ ట్విట్టర్ లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ పుట్టినరోజులు వచ్చినప్పుడు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేసేవాడు.కానీ ఇప్పుడు చెయ్యడం లేదు, గత కొంతకాలం నుండి మెగా ఫ్యామిలీ తో కోల్డ్ వార్ నడుస్తుంది అనే రూమర్ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అభిమానుల్లో కలుగుతుంది.

- Advertisement -
allu

మొన్న ‘నాటు నాటు’ పాటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పుడు కూడా రామ్ చరణ్ ని తగ్గించి జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడు.’నాటు నాటు’ పాట కేవలం రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ పాట కాదు..ఇద్దరి పాట అది, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు.కానీ అల్లు అర్జున్ ఒకరిని తగ్గించి ఇంకొకరిని ఎక్కువ చెయ్యడం పై చాలా తీవ్రమైన నిరసన వ్యక్తమైంది.ఇక ఈరోజు పుట్టినరోజు ని కూడా పట్టించుకోకపోవడం ని చూసి రామ్ చరణ్ అంటే అల్లు అర్జున్ కి ఇంత కుళ్ళు ఉంటుందని ఇన్ని రోజులు అనుకోలేదు అని చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here