మెగా పవర్ స్టార్ Ram Charan ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానించారు. ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ అయితే పొట్టోడు అని దారుణంగా అవమానించ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది..మరి రామ్ చరణ్ ని పొట్టోడు అని అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన పై మంచి అంచనాలు పెంచుకున్నాడు. ఈ హీరో రెండో సినిమా మగధీర.. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడమే కాదు.. కలెక్షన్స్ తో దూసుకుపోయింది..

ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఇటు రాంచరణ్ కెరియర్ అలాగే హీరోయిన్ గా కాజల్ కెరీర్ కూడా మారిపోయింది అని చెప్పవచ్చు. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఓ స్టార్ హీరోయిన్ వదులుకుందట.. ఆమె ఎవరొకాదు అనుష్క.. అవును.. మీరు వినేది నిజమే మొదటగా కాజల్ పోషించిన మిత్రవింద పాత్ర అనుష్కకే వచ్చిందట..కానీ అనుష్క మాత్రం రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడని,ఆ సినిమాలో హీరో హీరోయిన్ గా చేస్తే మేమిద్దరం అక్కా తమ్ముడులాగా కనిపిస్తామని, ఆ సినిమా బాగుండదు అంటూ చెప్పడంతో జక్కన్న అనుష్కని రిజెక్ట్ చేసి కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.

ఇక ఈ సినిమాలో కాజల్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ సినిమా ని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో తీద్దాం అనుకున్నారు.. కానీ కుదరలేదు.. ఈ విషయాన్ని జక్కన్న చాలా సందర్భాల్లో చెప్పారు.. అది ఇది అనికాదు రాజమౌళి తెరకేక్కిస్తున్న ఏ సినిమా అయిన భారీ విజయాన్ని అందుకుంటాయి.. ఇక RRR సినిమాతో ఆ విషయంపై ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది.. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..