Orane Re Realease : మగధీర వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’ చిత్రం ఆ రోజుల్లో ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ని నిర్మించిన నాగబాబు అప్పులపాలై ఆత్మహత్య కూడా చేసుకునే స్థాయికి వెళ్ళాడు.ఈ విషయాన్నీ స్వయంగా నాగబాబు పలు సందర్భాలలో ఇంటర్వ్యూస్ లో తెలిపాడు.ఆరోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది.
అప్పట్లో ఇది స్టార్ హీరో హిట్ మూవీ రేంజ్ వసూళ్లే, కానీ సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో తియ్యడం వల్ల బడ్జెట్ 40 కోట్ల రూపాయిలు దాటింది.అందుకే కమర్షియల్ గా అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది ఈ సినిమా.అలాంటి చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.నాగబాబు కి ఏమైనా మతి పోయిందా, ఒక డిజాస్టర్ సినిమాని పుట్టిన రోజు నాడు విడుదల చెయ్యడం ఏమిటి అంటూ ఫ్యాన్స్ తిట్టారు.
కానీ ఈ సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి టికెట్స్ ఆన్లైన్ లో పెట్టగానే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.ఇది వరకు స్టార్ హీరోలకు సంబంధించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసారు, కానీ వాటికి ఈ స్థాయి వసూళ్లు రాలేదు.
అలాంటిది ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు, అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు కచ్చితంగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను శాడిస్టునని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకి వచ్చే వసూళ్లు మొత్తం జనసేన పార్టీ కి ఫండ్స్ రూపం లో వెళ్తుందట.అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి టికెట్స్ ఒక రేంజ్ లో తెంపుతున్నారు అనే టాక్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.