Pawan Kalyan రెమ్యూనరేషన్ పై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్.. ఎంతంటే?

- Advertisement -

Pawan Kalyan : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఇమేజ్ ఉంది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కడ తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలో షూటింగ్లో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు రాజకీయాలలో కూడా పాల్గొంటూ ఉన్నాడు.

Pawan kalyan
Pawan kalyan

అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని తపన పడుతుందా పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. రోజు పవన్ కళ్యాణ్ కోట్లలో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన పవన్ కళ్యాణ్ రోజుకు తాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో అన్న విషయాన్నీ బహిరంగంగా తెలిపాడు. ప్రస్తుతం తాను రోజుకు 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిపారు పవన్..

Pawan kalyan

అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలకు నెల రోజులు లోపే ఇస్తున్నారని టాక్..ఒక సినిమాకూ 22 రోజులు పని చేస్తానని తెలిపారు. అంటే ఆ ప్రకారంగా ఒక్క సినిమాకు 44 కోట్ల పారితోషికంగా తీసుకుంటాను అని ఓపెన్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనపై రాజకీయంగా విమర్షలు చేసేవారికి సమాధానం చెపుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తను డబ్బు కోసం ఆశపడే వాడిని కాదని కావాలంటే తానే డబ్బులు ఇస్తానని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళ సినిమా వినోదయ సితం రీమేక్ లో నటిస్తున్నారు పవర్. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాకు గాను పవర్ స్టార్ 44 కోట్లు తీసుకున్నట్టు ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఇక ఈసినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చాలా కాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెండింగ్ లో ఉంది. అలాగే క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది.. ఇవన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయని ఆయన అభిమానులు చెబుతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here