ప్రస్తుతం Pavitra Lokesh , నటుడు నరేష్ ను వివాహం చేసుకున్నారనే వార్త సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై పవిత్ర లోకేష్ మొదటి భర్త సుచీంద్ర ప్రసాద్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ .. పవిత్ర లోకేష్ పై బండబూతులతో రెచ్చిపోయారు.. సుచీంద్ర ప్రసాద్ తో 2018 వరకు సహజీవనం చేసిన ఈమె ఆ తర్వాత నరేష్ పరిచయంతో సుచీంద్ర ప్రసాద్ నుంచి దూరం అయిపోయింది. ఆ తర్వాత అతనితోనే కలిసి పలు సినిమాలు తీసి సహజీవనం కూడా చేసిన ఈమె ఇప్పుడు వివాహం చేసుకోవడంతో సుచీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

సుచీంద్ర మాట్లాడుతూ.. పవిత్ర లోకేష్ ఒక అవకాశవాది.. విజయనిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని దొబ్బేసింది. నరేష్ , పవిత్ర ఇద్దరూ కలిసి జల్సాలు చేస్తూ విజయనిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్లది ప్రేమో.. వ్యామోహమో తెలియదు.. కానీ పవిత్ర లోకేష్ మాత్రం ఆశావాది.. డబ్బుపై ఆశతోనే నన్ను నా పిల్లలను మోసం చేసి నరేష్ చెంతకు చేరింది.. ఒకవేళ నరేష్ దగ్గర ఆ డబ్బు అయిపోతే మరొకరి దగ్గరకు వెళ్ళదన్న గ్యారెంటీ ఏంటి? అంటూ ఆమెపై విరుచుకు పడుతున్నారు..

ఆమెకు మానవత్వం లేదు అని.. సమాజం ఒక అడుగు వేస్తే ఆమె అందుకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుంది.. ఆమెతో ఎవరు ఉంటే వారి జీవితం నాశనం అవుతుంది అంటూ ఇలా నానారకాలుగా ఆమెపై బండబూతులు తిట్టడం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది. వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారని మొన్నీ మధ్య వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది.. ఇప్పుడు అది అంతా ఉత్తుత్తి అని తేలిపోయింది.. మరి సుచేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్లపై అటు నరేష్ ఇటు పవిత్ర లోకేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. ఏది ఏమైనా వీరిద్దరూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఫెమస్ అవుతుంటారు.. ఏంటో వీరిద్దరూ ఇప్పుడు జనాలకు ఎంటర్టైన్మెంట్ గా ఉన్నారు.. మరి పెళ్లి ఉందో లేదో తెలియాల్సి ఉంది..