Naga Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ ఒక చరిత్ర.ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హిట్టు మీద హిట్టు కొడుతూ, తన కుటుంబానికి చెందిన ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.నేడు వాళ్ళు పాన్ వరల్డ్ స్టార్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించి తెలుగు సినిమా కీర్తి ని పెంచుతున్నారు.ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతీ ఒక్కరు సక్సెస్ అయ్యారు కానీ, నాగబాబు మాత్రం కాలేకపోయాడు.
చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ అనే చిత్రం లో సెకండ్ హీరో గా ఆయన వెండితెర అరంగేట్రం చేసాడు.ఆ తర్వాత నాగబాబు ని ఇండస్ట్రీ లో ఒక మాస్ హీరో గా నిలబెట్టడానికి చిరంజీవి సన్నాహాలు చేసాడు.ఆయనతో గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన విజయ్ బాపినీడు తో నాగబాబు కి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని సిద్ధం చెయ్యమని చెప్పాడు.
మెగాస్టార్ చెప్పడం తో నాగబాబు కోసం ‘గ్యాంగ్ లీడర్‘ సబ్జెక్టు ని సిద్ధం చేసాడు బాపినీడు.కానీ అంతకు ముందే చిరంజీవి బాపినీడు కోసం డేట్స్ ఇచ్చి ఉన్నాడు, ఆయన డేట్స్ సమీపిస్తున్నాయి, కానీ ఇతని దగ్గర మెగాస్టార్ కోసం సరిపడ కథ లేదు.దీనితో నాగబాబు నాకోసం రాసుకున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని అన్నయ్య తో చెయ్యొచ్చు కదా, ఆయనకీ ఇంకా అద్భుతంగా ఈ సినిమా సెట్ అవుతుంది అన్నాడట, నాగబాబే అలా చెప్పడం తో చిరంజీవి డేట్స్ మొత్తాన్ని వినియోగించుకొని గ్యాంగ్ లీడర్ సినిమా తీసాడు బాపినీడు.
అది ఆరోజుల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .ఈ సినిమాతోనే ఆయన నెంబర్ 1 హీరో గా మారిపోయాడు. ఒకవేళ నాగబాబు ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటె హీరో గా స్థిరపడిపొయ్యేవాడేమో, చిరంజీవి కి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కూడా మిస్ అయ్యేది.