Ram Charan గత ఏడాది విడుదలైన #RRR సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఒక ఎత్తు అయితే,డిజిటల్ మీడియా లో సృష్టించిన ప్రభంజనం మరో ఎత్తు.నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ తో విడుదలైన ఈ సినిమాని విదేశీయులు ఎగబడి మరీ చూసారు.తద్వారా ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించి హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఎన్నో గెలుచుకుంది.
మరో వారం రోజుల్లో ఆస్కార్ అవార్డు ని కూడా గెలవబోతున్న ఈ సినిమా గురించి మీకెవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళి అడిగినన్నీ డేట్స్ ఇచ్చారు.ఇద్దరి హీరోలకు అప్పుడే రంగస్థలం మరియు అరవింద సామెత వంటి భారీ విజయాలను అందుకొని ఉన్నారు.అలాంటి సమయం లో ఒక చిత్రానికి మూడేళ్ళ పాటు డేట్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో ఇద్దరి హీరోలకు చాలా తీవ్రమైన గాయాలయ్యాయి..ఆ సమయం లో నెలల తరబడి షూటింగ్స్ ఆగిన రోజులు కూడా ఉన్నాయ్,అలా ఎన్నో కష్టనష్టాలతో తెరకెక్కించిన ఈ సినిమాకి నేడు ఇలాంటి అరుదైన గౌరవాలు దక్కించుకోవడం మన అందరికీ ఎంతో గర్వకారణం.ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రంగస్థలం కి ముందే ఒక సినిమా కమిట్ అయ్యాడు రామ్ చరణ్, బోయపాటి శ్రీను తో చేస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత ఈ సినిమానే ప్రారంభం కావాల్సి ఉంది,కానీ మధ్యలో #RRR ప్రాజెక్ట్ రావడం తో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది.అదే కథతో ఆయన అల్లు అర్జున్ ని పెట్టి ‘అలా వైకుంఠపురం లో’ అనే సినిమా తీసాడని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.ఈ చిత్రం తో పాటుగా రామ్ చరణ్ డైరెక్టర్ లోకేష్ తో ఒక సినిమా మరియు కొరటాల తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.#RRR కోసం వాటిని వదులుకోవాల్సి వచ్చింది అట.