Akshay Kumar లెహంగాలో డ్యాన్స్ ఇరగదీసిన బాలివుడ్ హీరో..ఆ ఊపుడేంది సామి.. వీడియో వైరల్..

- Advertisement -

Akshay Kumar బాలివుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..వయస్సుకు ఆయనకు అస్సలు సంబంధం లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..ప్రస్తతం యూఎస్‌ పర్యటనలో ఉన్నాడు..అక్షయ్ ది ఎంటర్‌టైనర్స్’ టూర్‌లో నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్‌, సోనమ్ బజ్వా, అపర్శక్తి ఖురానా సహా పలువురు సెలబ్రిటీలు భాగం అయ్యారు. బాలీవుడ్ స్టార్స్ శుక్రవారం అట్లాంటాలో మొదటి ప్రదర్శన ఇచ్చారు. ఈ షోకి సంబంధించి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. షోలో అక్షయ్‌ కుమార్‌ స్టేజీపై వేసిన స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి..

Akshay Kumar
Akshay Kumar

ఈ మధ్యకాలంలో ‘సెల్ఫీ’ చిత్రంలోని మే ఖిలాడీ పాటకు అక్షయ్ కుమార్, నోరా ఫతేహి కలిసి చిందేశారు. అక్షయ్ తన నలుపు దుస్తులపై ఎరుపు రంగు లెహంగా ధరించి వచ్చారు. చొక్కాలేకుండా దర్శనం ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు.నోరా ఫతేహి పొట్టి ఎరుపు రంగు డ్రెస్సులో వేదికపైకి వచ్చింది. సాంగ్‌ ఊపందుకుంటున్న సమయంలో అక్షయ్‌ తన లెగంగా విప్పేసి మరీ డ్యాన్స్‌ వేశాడు. ఇద్దరూ కలిసి అదిరే స్టెప్పులు వేశారు. ఈ ఇద్దరి స్టెప్పులకు సంబందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

అక్షయ్ కుమార్, నోరా ఫతేహి స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరి మాస్‌ పర్ఫామెన్స్‌కు అక్కడున్నవారు ఈలలు, కేకలతో అభినందనలు తెలియజేశారు. అక్షయ్‌ ఖిలాడీలా ఉన్నాడని, స్కర్ట్‌తో సూపర్ డాన్స్ చేశాడని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు..మరోవైపు నోరా ఫతేహి చాలా హాట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు..యూఎస్‌లోని ప్రేక్షకుల కోసం ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి అక్షయ్ కుమార్ ఈ టూర్ ప్లాన్ చేశాడు. అట్లాంటాలో మొదటి షో ముగియగా.. తర్వాతి షో డల్లాస్‌లో ఉంది. ఇక అక్షయ్ కుమార్ ‘వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here