అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్‌గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా బన్నీకి ప్యాన్ ఇండియాలో గుర్తింపు తీసుకువచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిన కూడా రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా సౌత్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ పుష్ప మేనియాతో ఒక్కసారిగా సౌత్‌పై ఫోకస్ చేసింది. సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. దక్షిణాది స్టార్లను పొగడ్తలతో ముంచెత్తడం షురూ చేసింది. పుష్ప మూవీకి ఈ రేంజ్లో క్రేజ్ వస్తుందని మేకర్స్ కూడా ఊహించలేదు. పుష్ప పార్ట్ 1కు వచ్చిన క్రేజ్ చూసి డైరెక్టర్ సుకుమార్ దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యాడు. పార్ట్ 2 విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ కోసం బడ్జెట్‌ను రూ. 350 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారట. అంతే కాకుండా పార్ట్ 1కు వచ్చిన రిజల్ట్‌ను, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పుష్ప ది రూల్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. దీనికోసం ఇప్పటికే సుకుమార్ అండ్ టీమ్ ప్లానింగ్ రెడీ చేసింది. షూటింగ్ కూడా మొదలు పెట్టారు. చైనా, థాయ్‌లాండ్‌లలో పలు కీలక ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని దట్టమైన అడవుల్లో అల్లు అర్జున్‌పై భారీ స్థాయిలో పులి ఫైట్‌ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త రీసెంట్గా బయటకు వచ్చింది.
ఇక పుష్ప-2లో పాత్రల గురించి మాట్లాడితే.. అల్లు అర్జున్‌తో పాటు శ్రీవల్లి అదేనండి రష్మిక కూడా ఉంటుంది. కాకపోతే తొలి పార్ట్‌లో ఉన్నట్లు ఆమె పాత్రకు సెకండ్ పార్ట్‌లో అంత ప్రాధాన్యం ఉండకపోచ్చునని టాక్. అంతే కాకుండా శ్రీవల్లి క్యారెక్టర్‌ను చంపేసి సినిమాలో ఎమోషనల్ యాంగిల్ కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట సుకుమార్. ఇక ఫస్ట్ పార్ట్‌లో ఉన్న విలన్స్ సునీల్, అనసూయ పాత్రల నిడివి సెకండ్ పార్ట్‌లో పెంచాలనే యోచనలో ఉన్నారట.
వీళ్లే కాకుండా ఇప్పటికే కీలక లేడీ విలన్ పాత్ర కోసం కేథరిన్‌ని, మరో కీలక పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌ను కూడా డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ చేసినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లే కాకుండా మరో బ్యూటీని కూడా ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ దివి.Divi Vadthya పుష్ప-2లో ఓ టీవీ ఛానల్‌కు సంబంధించిన లేడీ జర్నలిస్టు పాత్ర కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం ఓ ప్రముఖ లేడీ జర్నలిస్టుతో దివికి వర్క్‌షాప్ కూడా నిర్వహించి ఫైనల్ చేశారట.