#SSMB28 : మహేష్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. ఉగాదికి సర్ ప్రైజ్ రెడీ?

- Advertisement -

#SSMB28 : సర్కార్ వారి పాట సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది..సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అడ్డంకి వస్తుంది.. దాంతో సినిమా నుంచి అప్డేట్స్ డిలే అవుతున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్ కు త్రివిక్రమ్ ఉగాది ట్రీట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

#SSMB28
#SSMB28

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు అప్పట్లో థియేట్రికల్ పరంగా పెద్దగా ఆడకపోయినా టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఆడియన్స్ ఎగబడిమరీ చూసారు..ఇప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు వచ్చాయంటే చాలు, ఆడియన్స్ పనులన్నీ మానుకొని మరీ టీవీ ముందు కూర్చుంటారు.అలాంటి సినిమాలు వీరి కాంబినేషన్ నుండి వచ్చాయి కాబట్టే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా పై అంతటి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాకి క్రేజీ బిజినెస్ డీల్స్ కూడా వస్తున్నాయి.ఇప్పటికే డిజిటల్ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కి 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

Mahesh Babu

కాగా, త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB28 చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఉగాది సందర్భంగా మార్చి 22న మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు..థమన్ సంగీతం అందిస్తుండగా, సూర్య దేవర నాగవంశీ ( భీమ్లా నాయక్ నిర్మాత) ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here