Nithin ‘దిల్’ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎంత హాట్ గా తయారు అయ్యిందేంటి..! చూస్తే తట్టుకోలేరు

- Advertisement -

Nithin టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు.అందరినీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం.ఎప్పుడైనా టీవీ లో సినిమా చూస్తున్నప్పుడు ‘ఈ అమ్మాయి బాగుందే,మళ్ళీ సినిమాల్లోకి రాలేదేంటి’ అని అనుకోవడం సహజమే.అలా అనిపించే హీరోయిన్స్ లో ఒకరు ‘నేహా బాంబ్’.యంగ్ హీరో నితిన్ మరియు వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ దిల్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది.

Nithin
Nithin

తొలి సినిమా సూపర్ హిట్టై ఆమెకి మంచి పేరుని అయితే తెచ్చిపెట్టింది కానీ, సినిమాల్లో హీరోయిన్ రోల్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.దిల్ తర్వాత ఆమె నందమూరి తారకరత్న హీరో గా నటించిన ‘నో’ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసింది.ఆ తర్వాత జగపతి బాబు హీరో గా నటించిన ‘అతడే ఒక సైన్యం’ సినిమాలో హీరోయిన్ గా చేసింది,ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించినప్పటికీ ఆమె స్టార్ కాలేకపోయింది.చిన్న సినిమాల్లోనే అవకాశాలు వచ్చేవి.

neha
neha

అలా ఆమె శివ బాలాజీ తో దోస్త్ అనే చిత్రం లో నటించింది..ఈ సినిమా ఎప్పుడొచ్చిందో,ఎప్పుడెల్లిందో అనేది ఎవరికీ తెలియదు.అదే ఆమె హీరోయిన్ గా నటించిన ఆఖరి సినిమా అయ్యింది.ఇక ఆ తర్వాత సిద్దార్థ్ -జెనీలియా కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘బొమ్మరిల్లు’ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్ర ద్వారా తళుక్కుమని మెరిసింది.ఇందులో ఆమె మాటికొస్తే ‘నాన్న గారు చెప్పారండి’ అంటూ మాట్లాడడం బాగా పాపులర్ అయ్యింది.దిల్ సినిమా తర్వాత ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిన పాత్ర ఏదైనా ఉందా అంటే అది ఇదే.ఈ సినిమా తర్వాత దుబాయి శ్రీను లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది.

- Advertisement -

ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది కానీ , సీరియల్స్ లో మాత్రం కొనసాగింది.ఆమె సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు కూడా సీరియల్స్ ఆపలేదు.పలు హిందీ సీరియల్స్ లో చేస్తూనే ఉండేది, అలా 2009 వ సంవత్సరం వరకు సీరియల్స్ లో కొనసాగిన ఈమె ఆ తర్వాత కనిపించడం మానేసింది , కానీ అభిమానులతో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.ఆమె లేటెస్ట్ ఫోటోలు మరియు వీడియోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here