జుమ్కా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన అనసూయ

- Advertisement -

యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు. ఈమె జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే బుల్లితెరపై చాలా షోలకు హోస్టుగా చేసింది. మరోపక్క సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంటుంది. అటు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాల్లో నటించి ఓ నటిగా తనేంటో ఫ్రూఫ్ చేసుకున్నారు. సోషల్ మీడియా వల్ల అనసూయ లేనిపోని కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోందన్న వార్తలు విరివిగా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడింది. ఆ విషయాలను పక్కకు పెడితే.. అనసూయ ఈ మధ్య బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఎక్కువ సినిమాల మీదే కాన్సట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప -2 తో పాటు ఒకటి రెండు భారీ సినిమాల్లో చేస్తోంది.

అనసూయ
అనసూయ

ఈ మధ్య అవకాశాలు తగ్గాయేమో తెలియదు. కానీ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతోంది. తాజాగా ఆమె చీరలో జుమ్కా సాంగ్ కు వయ్యారాలు ఒలికిస్తూ చేస్తున్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో అనసూయ అందచందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది. తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేస్తూ.. నాకు తెలుసు.. నేను ట్రెండ్‌కి చాలా ఆలస్యం అయ్యాను. ఈ చుట్కు ఝుమ్కా స్టెప్‌తో నేను డ్యాన్స్‌ని ఎంత మిస్ అయ్యానో గ్రహించాను అంటూ రాసుకొచ్చారు. అనసూయ నటిగా చిత్రాలు, వెబ్ సిరీసుల్లో బిజీగా ఉంటూ యాంకరింగ్ పై ఫోకస్ తగ్గించింది. ఈటీవికి పూర్తిగా గుడ్ బై చెప్పి ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తుంది. ఇటీవల ఆమె రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా విడుదలైన దర్జా, వాంటెడ్ పండు గాడ్ చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here