Prabhas :ప్రభాస్ ఎంత మంచోడు.. ఇదే సాక్ష్యం..గ్రేట్ భయ్యా..

- Advertisement -

Prabhas:ప్రభాస్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు..సినిమాలకు మాత్రమే కాదు.రియల్ లైఫ్ లో కూడా చాలా మంచివాడని అతని సన్నిహితులు అంటున్నారు.ఆయన తో స్నేహం చేస్తే అతనికి ఎటువంటి కష్టం రాకుండా నేనున్నా అంటూ ముందుకు వస్తాడు..కొన్ని ఊర్లను దత్తత తీసుకోవడం మాత్రమే కాదు..భూములు కొని రైతులకు ఇచ్చారు..నిజంగా ఇలాంటి మనిషి గురించి ఎంత పొగిడినా తక్కువే..ఇతన్ని అందరు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు..ఇక రోజు రోజుకు ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగి పోతుంది.

- Advertisement -

ప్రభాస్ కోసం ఏమైనా చేసేంత ఫ్యాన్స్ ఉన్నారు.అందుకే ఇటీవల వస్తున్న సినిమాలు కథ పరంగా ఆకట్టులేక పోయిన కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే వసూల్ చేస్తున్నాయి..అతని రేంజ్ ప్రస్తుతం బాలివుడ్ నుంచి హాలివుడ్ వెళ్ళింది.అక్కడ నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.గతంలోకి వెళ్లి చూస్తే అతను స్టార్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి చాలా టైం పట్టింది. ప్రభాస్ కెరీర్లో మొదటి హిట్ అందుకోవడానికి మూడో సినిమా ‘వర్షం’ వచ్చేవరకు ఆగాల్సి వచ్చింది. తర్వాత మాస్ ఇమేజ్ ను సంపాదించుకోవడానికి 6 వ సినిమా ‘ఛత్రపతి’ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కు వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి.

జక్కన్న తో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా ప్లాప్ లు తప్పవు అని ప్రభాస్ రూపంలో ఆ టైంలో మరోసారి రిపీట్ అయ్యింది. ‘డార్లింగ్’ తో ప్రభాస్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అటు తర్వాత ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. అటు తర్వాత ‘మిర్చి’ తో ప్రభాస్ స్టార్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ లేదు అని భావించి ఓ సినిమా నుండి తప్పించారట. ఆ సినిమా మరేదో కాదు వెంకటేష్- గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఘర్షణ’. ఈ కథ ముందుగా.. ప్రభాస్ వద్దకే వెళ్ళింది. కానీ ఆ టైంలో ప్రభాస్ ఫామ్లో లేడు అని భావించి, వెంకటేష్ తో కథ చేసుకున్నామని ప్రభాస్ కు చెప్పారట. అందుకు ప్రభాస్ ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా ఓకే చెప్పేసి తన నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టాడట..

సినిమా నుండి తప్పించినప్పటికీ ప్రభాస్ ‘ఘర్షణ’ ఆడియో రిలీజ్ వేడుకకు గెస్ట్ గా వచ్చి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు.అమాయకత్వం, మంచితనం ఎక్కువ ఉంటాయి కాబట్టే.. ప్రభాస్ ఇలాంటి విషయాలను పెద్దగా కేర్ చెయ్యడని ఈ విషయంతో అర్థం చేసుకోవచ్చు.ఇక 2004 లో రిలీజ్ అయిన ‘ఘర్షణ’ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది..నిజంగా గ్రేట్ కదా..ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు..ఆ సినిమాలు త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోని వచ్చే ఏడాది విడుదలకు సిద్దం కానున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here