హనీ రోజ్ కోసం గొడవ చేస్తున్న కుర్రాళ్లు.. కారణమిదే..

- Advertisement -

‘హానీ రోజ్‘.. వీరసింహారెడ్డి రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో బాగా వినబడుతున్న పేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరు ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ సరసన ‘వీరసింహరెడ్డి’ సినిమాలో పెర్ఫార్మన్స్ తో పాటు డాన్స్ కూడా అదరగోట్టి.. యావత్ తెలుగు కుర్రాళ్లను తనవైపు లాక్కుంది. అయితే.. అందరూ వీరసింహారెడ్డి సినిమాతోనే హనీ రోజ్.. టాలీవుడ్ కి పరిచయమైందని అనుకున్నారు. కానీ.. గతంలోనే అమ్మడు రెండు సినిమాలు చేసింది. 2008లో ‘ఆలయం’.. 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

హనీ రోజ్
హనీ రోజ్

అయితే.. ఈ రెండు సినిమాలు కూడా హనీకి తెలుగులో మంచి హిట్ ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత నుండి మళయాళంలోనే వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్డమ్ సొంతం చేసుకుంది. మళ్లీ 8 ఏళ్లకు బాలయ్య సరసన వీరసింహారెడ్డి మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా అవకాశాలతో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ఇప్పుడు హానీ రోజ్ అంటే.. తెలుగులో వీరసింహారెడ్డికి ముందు, తర్వాత అని చెప్పుకుంటున్నారు.

Honey Rose

ఇంతకాలంగా ఈ సుందరి ఏమైపోయిందబ్బా అనుకున్న కుర్రాళ్లంతా, ఇక ఆమె జోరు కొనసాగడం ఖాయమని అనుకున్నారు. రానున్న స్టార్ హీరోల సినిమాల జాబితాలో ఆమె పేరు తప్పకుండా ఉంటుందని భావించారు. కానీ క్లాప్ వరకూ వెళ్లిన ఏ తెలుగు ప్రాజెక్టులోను ఆమె పేరు కనిపించడం లేదు. కారణం ఏమిటనేది తెలియడం లేదు. కుర్రాళ్లు మాత్రం ఆమెను సాధ్యమైనంత త్వరగా తెరపై చూడాలనే ఆరాటంతో కనిపిస్తున్నారు. సినిమాల్లో ఆమెను తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here