Game Changer : RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని అభిమానులు మురిసిపోయారు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా ప్రారంభం అయ్యిందో, ఎవరి దిష్టి ఈ సినిమా మీద పడిందో తెలియదు కానీ, షూటింగ్ నత్త నడకన సాగుతూ, మరోపక్క అప్డేట్స్ లేక, అభిమానులను మెంటల్ టార్చర్ కి గురి అయ్యేలా చేసింది ఈ చిత్రం.
అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ నిన్న మొదలైంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ మధ్య ఒక డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తి అయ్యాక సినిమా దాదాపుగా 90 శాతం అయిపోయినట్టే. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా సినిమాని విడుదల చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.
ఈ సినిమాలో ట్రైన్ లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుందట. ఆ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్ గా నిలుస్తుంది అట. ఈ సన్నివేశం ని తియ్యడానికి నిర్మాత దిల్ రాజు తో 50 కోట్ల రూపాయిల బడ్జెట్ ని పెట్టించాడట డైరెక్టర్ శంకర్. థియేటర్స్ లో ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకుంటాయట. ఆ సన్నివేశం తాలూకు 20 సెకండ్ల వీడియో ని టీజర్ ని పెట్టబోతున్నారట.
మార్చి 27 వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆరోజే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇన్ని రోజుల అభిమానుల ఆకలి ని తీర్చే విధంగా ఆ టీజర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే టీజర్ కి సంబంధించిన వర్క్ మొదలైందని, త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు, చూడాలి మరి.