Vaishnavi Chaitanya : బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన నటులకు కెరీర్ ప్రారంభం మొత్తం అవమానాలతోనే ప్రారంభం అవుతుంది. ఎన్ని అవమానాలు అయినా భరించగలరు, ఎందుకంటే కెరీర్ ఇదే అని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి. కానీ కనీస స్థాయి వసతులు కూడా లేకపోతే నరకప్రాయమే అవుతుంది. అలా ‘బేబీ’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా కెరీర్ ప్రారంభం లో ఇలాంటి అవమానాలే ఎదురుకుంది.
ఈమె యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే యూట్యూబ్ సిరీస్ పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చాలానే వచ్చాయి. అలా క్యారక్టర్ రోల్స్ వేస్తున్న రోజుల్లో తనకి ఎదురైనా కొన్ని చేదు జ్ఞాపకాలను తలచుకొని బాధపడింది వైష్ణవి చైతన్య. ఆమె మాటలు వింటే ఇంత మానవత్వం లేకుండా ఎలా ఉండగలరు అని మనకి అనిపించక తప్పదు.
అసలు విషయానికి వస్తే ఒక సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్టుగా వైష్ణవి చైతన్య. ఆ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో పెట్టుకున్నారు. తనకి సంబంధించిన తదుపరి షాట్ కోసం వైష్ణవి బట్టలు మార్చుకోవాల్సి ఉంది. చుట్టూ ఎక్కడ చూసిన జనాలు ఉన్నారు, మార్చుకోవడానికి చాలా కష్టం గా ఉండేది అట. అప్పుడు ఆ సినిమా హీరోయిన్ కార్వాన్ లోని వాష్ రూమ్ కి వెళ్లి బట్టలు మార్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ హీరోయిన్ అసిస్టెంట్ ని అడిగింది.
ఆ అసిస్టెంట్ మొహమాటం లేకుండా లోపలకు అడుగుపెట్టడానికి కూడా వీలు లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇంతమంది ముందు ఆడపిల్ల బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది గా ఉంటుంది కదా, దయచేసి సహకరించండి అని బ్రతిమిలాడినా ఒప్పుకోలేదట. చివరికి లేడీ టెక్నీషియన్స్ సహాయం తో అదే షూటింగ్ లొకేషన్ లో పరదాలు వేసుకొని బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఈ విషయాన్నీ వైష్ణవి చైతన్య చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది.