Sidharth : హీరో సిద్ధార్థ తన భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడో తెలుసా ?

- Advertisement -


Sidharth : తాజాగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి మధ్య ఎఫైర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహాసముద్రంలో కలిసి నటించి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్స్, నువ్వువొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్.. ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా అంతగా విజయాలను దక్కించుకోలేకపోయాడు.

హీరో సిద్ధార్థ పేరు చెబితేనే చాలు కలలుగనే అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి అలాంటి హీరో.. తన కెరీర్ ను ఎందుకు నాశనం చేసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తను పనిచేసిన హీరోయిన్లందరితో ఎఫైర్ పెట్టుకుంటాడనే రూమర్ వల్ల అతని జీవితం పాడైపోయిందంటున్నారు. ప్రస్తుతం అదితితో డేటింగ్ చేస్తున్న సిద్ధార్థ్.. భార్యకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు..? ఆమెను ఎందుకు దూరంగా ఉంచాడు? ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

2003 సంవత్సరంలోనే సిద్ధార్థ్ తన ఎదురింట్లో ఉంటున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు చిహ్నంగా ఓ బాబు కూడా పుట్టాడు. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. దీంతో పెళ్లయిన మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొడుకు బాధ్యతలను సిద్దూ స్వయంగా చూసుకుంటున్నాడు. కానీ మరో పెళ్లి చేసుకోలేదు. చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడా పెళ్లి వరకు వెళ్లలేదు. ఇప్పుడు హీరోయిన్ అదితిని పెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం వైరల్ అవుతుంది..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here