Venkatesh : నా కొడకల్లారా.. అంటూ స్టేజ్ పైనే విశ్వరూపం చూపిన వెంకటేష్..ఇంత కోపం ఎవరిమీదో..!

- Advertisement -

Venkatesh : వెంకటేశ్ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’.. ఈసారి సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో ‘సైంధవ్’ వస్తుందని, జనవరి 13 బ్రహ్మాండంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు వెంకటేశ్. ‘‘వైజాగ్ అంటే నాకు ఇష్టం ఇష్టం. నా మొట్టమొదటి సినిమా నుండే మీరు చాలా ప్రేమ, ఆదరణ చూపించారు. కలియుగ పాండవులు, సుందరకాండ షూటింగ్స్‌కు ఇక్కడికే వచ్చాను. పెళ్లికాని ప్రసాద్ ఇక్కడే తిరిగాడు. గురు ఇక్కడే చేశాను.

గోపాల గోపాలకు పవన్‌తో వచ్చాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కోసం నా తమ్ముడు మహేశ్‌తో వచ్చాను. ఇప్పుడు సైంధవ్‌తో వచ్చాను. స్టీల్ ప్లాంట్‌లో రాత్రి రెండు గంటల వరకు షూట్ చేశాం. ఫ్యాన్స్ మీరుంటే చాలు. అక్క, బావ, తాత, అమ్మమ్మ అందరూ సైంధవ్‌కు రావాలి. నా 75వ సినిమా. చాలా ఎమోషనల్, యాక్షన్, న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా తీశాం. శైలేష్ చాలా బ్రాగా ప్రెజెంట్ చేశాడు. మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. ఎమోషనల్ సీన్స్‌లో అన్ని సినిమాలను బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరం చాలా కష్టపడి ఒక మంచి సినిమా ఇవ్వాలని సైంధవ్ చేశాం’’ అంటూ తన వైజాగ్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఫ్యాన్స్‌ను ‘సైంధవ్’ చూడాలని కోరారు వెంకటేశ్.

తనను ఒక డైలాగ్ చెప్పమని ఫ్యాన్స్ కోరారు. ‘‘వెళ్లేముందు చెప్పి వెళ్లా. వినలా. అంటే భయం లేదు. లెక్క మారుతుంది నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో అక్కడక్కడ పంచ్‌లు. ఇంకొకటి కూడా ఉంది. షర్ట్ వేసుకున్న ప్రతీవాడికి కాలర్ ఉంటుందిరా. కానీ ఆ కలర్ ఎవరి మెడ మీద ఉందో చూసుకొని దానికి ఒక రెస్పాక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతుంది నాకొడకా’’ అంటూ బ్యాక్ బ్యాక్ డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు వెంకటేశ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here