Allu Arjun : మెగా ఫ్యామిలీ మీద అల్లు అర్జున్ కి ఇంత పగ ఉందా..! ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసాడుగా

- Advertisement -

Allu Arjun : చాలా కాలం నుండి ఇండస్ట్రీ లో మరియు మీడియా లో జోరుగా ప్రచారం అయ్యే వార్త ఏమిటంటే పాలు నీళ్లు లాగ కలిసి ఉండే చిరంజీవి కుటుంబం మరియు అల్లు కుటుంబం మధ్య విభేదాలు వచ్చాయని, రెండు కుటుంబాల మధ్య బాగా గ్యాప్ ఏర్పడింది అని.అల్లు అర్జున్ కి రెండు మూడు భారీ హిట్స్ వచ్చిన తర్వాత ఆయనలో వచ్చిన పెను మార్పులు చూసి మెగా అభిమానులు కంగుతిన్నారు.

Allu Arjun
Allu Arjun

ప్రతీ ఈవెంట్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడే అల్లు అర్జున్, సరైనోడు సినిమా విజయోత్సవ సభ లో పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అడుగుతున్నప్పుడు ‘చెప్పను బ్రదర్’ దగ్గర నుండి మెగా మీద తనకి ఉన్న అక్కసుని వెళ్లగక్కడం ప్రారంభించాడని మెగా అభిమానులు చెప్పుకొచ్చే మాట.ఆ తర్వాత అల్లు అర్జున్ లో ఇలాంటి షేడ్స్ చాలానే కనిపించాయి.అంతకు ముందు మొత్తం మెగా ఫ్యామిలీ అంటూ చెప్పుకొని తిరిగే అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ అంటూ చెప్పుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన #RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసాడు.ఆస్కార్ అవార్డు గెలిచినందుకు గాను కీరవాణి కి, చంద్ర బోస్ కి మరియు మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్స్ అయినా నా తమ్ముడు రామ్ చరణ్ కి ,అలాగే తెలుగు జాతి గర్వించే నటుడు ఎన్టీఆర్ కి తన అద్భుతమైన డ్యాన్స్ తో గ్లోబల్ వైడ్ రీచ్ తెచ్చినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఆయన వేసిన ఒక ట్వీట్ వివాదాలకు దారి తీసింది.

- Advertisement -

ఎన్టీఆర్ తెలుగువాళ్ళు గర్వించే నటుడు అయితే , మరి రామ్ చరణ్ ఏమిటి?,ప్రత్యేకంగా ఎన్టీఆర్ డ్యాన్స్ వల్లే రీచ్ వచ్చినట్టు కూడా వేసాడు, ఇదంతా ఎందుకు?, మామూలుగా ఇద్దరి హీరోలకు శుభాకాంక్షలు తెలియచేస్తే సరిపోతుంది కదా..సందర్భం దక్కినప్పుడల్లా ఎందుకు ఇలా విషం కక్కడం అంటూ అల్లు అర్జున్ పై మెగా అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here