Sonia Singh : అసలు ఈ సోనియా సింగ్ ఎవరు?.. యుట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రిన్ పై క్రేజ్…

- Advertisement -

లక్ ఉంటే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు అని చాలా మంది ప్రూవ్ చేశారు.. తాజాగా ఓ ముద్దుగుమ్మ యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.. ఆమె ఎవరో కాదు.. సోనియా సింగ్.. ఈ పేరు ఎక్కడ చూసిన వినిపిస్తుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ ఫెమస్ అయినా సోనియా ఇప్పుడు విరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది..తన పెర్ఫార్మన్స్ బాగుండటంతో యూత్ ఆమె గురించి వెతికే పనిలో పడ్డారు..బాంబే నుంచి వచ్చిన సోనియా మొదట హే పిల్ల అనే ఛానెల్ లో నటించింది.

Sonia Singh
Sonia Singh

అక్కడ ఫుల్ పాపులర్ అవ్వడం తో ఆమె గురించి సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. తెలిసి తెలియక ఆమె మాట్లాడే మాటలు ఫుల్ వైరల్ గా మారాయి…అంతేకాదు ఆమెకు వచ్చి రాని తెలుగు ఒక ఎత్తు అయితే డబల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఫుల్ పాపులర్.ఇక యూట్యూబ్ లో ఇవే కాకుండా ఓయ్ పద్మావతి, పెళ్ళైన కొత్తలో, రౌడీ బేబీ అనే సిరీస్ లు కూడా చేసింది. ఇక బుల్లి తెర కూడా అలీ హీరో గా నటించిన యమలీల సినిమాకు సీక్వెల్ గా యమలీల ఆ తర్వాత అనే సీరియల్ రాగా అందులో ప్రధాన పాత్రలో కనిపించింది..అది కూడా మంచి పేరు అందించింది.. దీంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగిపోయింది..

ఆ మధ్య బుల్లితెరపై ప్రసారం అయినా ఓ షో లో కనిపించింది.. దాంతో సోనియా పేరు అందరికి తెలిసింది.. దాంతో ఏకంగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో అవకాశం కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర బాగానే ఉంది. ఇక ఇదే కాకుండా మరొక నాలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది సోనియా. ఈమె పవన్ అనే తన తోటి యూట్యూబర్ తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది.

- Advertisement -

వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ లు అన్ని కూడా బాగా వ్యూస్ దక్కించుకున్నాయి. ఇక పోతే సోనియా సింగ్ ఎక్కడ ఉంటె అక్కడ సెన్సేషన్ అన్నట్టుగా తయారయ్యింది. ఆమె విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది..ఇప్పుడు సినిమా హిట్ అయ్యింది.. ఇలాగే ఈ అమ్మడు పది సినిమాలు చేస్తే నో డౌట్ పెద్ద హీరోయిన్ అయిపోతుంది.. చూద్దాం ఏ రెంజుకు వెళుతుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here