K Viswanath : తెలుగు సినీ పరిశ్రమ ఎంతో గర్వంగా భావించే మహానుభావుడు, ఆల్ టైం క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకులు, కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి ఘటన యావత్తు సినీ లోకాన్ని,అసంఖ్యాకంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ , నేడు ఆయన పవిత్రమైన పార్థివ దేహాన్ని చివరిసారిగా ఒకసారి చూసుకొని నివాళి అర్పించారు.
ఇది ఇలా ఉండగా కె.విశ్వనాథ్ గారు ఎంతో మంది హీరోలను డైరెక్ట్ చేసాడు , కలిసి నటించాడు కూడా.నటన గురించి ఆయనకీ తెలిసినంత ఏ దర్శకుడికి కూడా తెలియదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాంటి మహానుభావుడికి ఒకరు నచ్చడం అంటే సాధారణమైన విషయం కాదు.ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఇచ్చిన పలు ఇంటర్వూస్ లో నేటి తరం స్టార్ హీరోలలో మీకు బాగా నచ్చింది ఎవరు అని అడిగిన ప్రశ్న కి ఆయన ఇచ్చిన సమాధానం ఆరోజుల్లో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.
ఈ తరం హీరోలలో ప్రతీ ఒక్కరు బాగా నటిస్తున్నారని, కానీ నాకు అందరికంటే జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ నటన బాగా నచ్చుతుందని, అలా అని మిగిలిన వాళ్ళు బాగా చెయ్యడం లేదని కాదు అంటూ అప్పట్లో విశ్వనాథ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ అభిమానులు ఆయన అప్పట్లో చెప్పిన ఈ మాటలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ విశ్వనాథ్ గారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఎన్టీఆర్ తో విశ్వనాథ్ నిన్ను చూడాలని మరియు అల్లరి రాముడు వంటి సినిమాల్లో నటించాడు, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు కానీ స్వాతి ముత్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు గా అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసాడు.