Ram charan : రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఆ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ కు నేషనల్ అవార్డు వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే RRR మూవీ తరువాత హీరో రామ్ చరణ్ కు గ్లోబల్ లెవెల్ లో సూపర్ స్టార్ అయ్యాడు, పుష్పా మూవీ తరువాత డైరెక్టర్ సుకుమార్ కూడా నేషనల్ లెవెల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రంగస్థలం లాంటి హిట్ మూవీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈనెల 27న ఈ మూవీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూవీని కూడా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చెయ్యనున్నారు. గతంలో రంగస్థలం మూవీని కూడా ఈ సంస్థే నిర్మించింది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా దేవిశ్రీప్రసాద్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
అయితే ఈ మూవీకి సంబంధించిన హడావిడి ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది కానీ నిజానికి ఈ మూవీకి ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది మాత్రం రాజమౌళి. RRR మూవీ ప్రమోషన్ టైంలో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే మూవీలో ఉండే ఇంట్రడక్షన్ సీన్ గురించి చెప్తూ… ఈ సీన్ ఆడియన్స్ ను చాలా ఎంటర్టైన్ చేస్తుందని, దాన్ని స్క్రీన్ పై చూడటానికి తానూ ఎదురు చూస్తున్నానని చెప్పారు. అప్పటి నుండే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ మూవీ షూటింగ్ మాత్రం రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న మూవీ అయిపోయిన తరువాతే ఉండే అవకాశం ఉంది.