Mokshagna Teja జాతకం లో ఇన్ని దోషాలు ఉన్నాయా..ఇక సినిమాల్లోకి వచ్చినట్టే!

- Advertisement -

Mokshagna Teja : నందమూరి అభిమానులు ఎప్పటి నుండో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన జాతకం ప్రకారం ఇప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే సక్సెస్ లు రావని, 2024 తర్వాత ఎంట్రీ ఇస్తే ఆయనకీ మహర్దశ పడుతుందని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను బాలయ్య బలంగా నమ్మడం వల్లే మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటి వరకు జరగలేదని తెలుస్తుంది.

Mokshagna Teja with balakrishna
Mokshagna Teja

కానీ నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ కి 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి..ఇంకా ఎంట్రీ ఇవ్వకపోతే కష్టం అవుతుందేమో అని భయపడుతున్నారు.అయితే మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఉంటుందని, ఈ చిత్రానికి బాలయ్య బాబు దర్శకత్వం వహించడమే కాకుండా, ఒక ముఖ్య పాత్రలో కూడా నటించబోతున్నాడని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అవుతున్నాయి.

Mokshagna Teja with balakrishna

బాలయ్య సైతం ఆదిత్య 369 కి సీక్వెల్ చేస్తునట్టు ఇది వరకే ప్రకటించాడు కానీ, అందులో తాను హీరోగా నటించబోతున్నాడా, లేదా మోక్షజ్ఞ నటించబోతున్నాడా అనేది మాత్రం చెప్పలేదు.ఆ సంగతి కాసేపు పక్కన పెడితే హీరోలు మరియు రాజకీయ నాయకుల జాతకాలను చెప్తూ మంచి పాపులారిటీ ని సంపాదించిన వేణు స్వామి మోక్షజ్ఞ జాతకం గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -
balakrishna family

ఆయన మాట్లాడుతూ ‘మోక్షజ్ఞ జాతకం చాలా బాగుంది, ఇండస్ట్రీ లోకి అతడు అడుగుపెడితే తన తండ్రిలాగానే గొప్ప స్టార్ స్టేటస్ ని దక్కించుకుంటాడు.భారీ హిట్స్ వస్తాయి.. కానీ నందమూరి కుటుంబానికి సినిమాలతో పాటుగా రాజకీయం కూడా ఉంటుంది, మోక్షజ్ఞ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఆయన జాతకం రాజకీయాలకు ఏమాత్రం అచ్చిరావడం లేదు’ అంటూ వేణు స్వామి కామెంట్స్ చేసాడు.ఒక జోతిష్యుడు ఏమో మోక్షజ్ఞ జాతకం బాలేదు అంటాడు, ఇంకో జోతిష్యుడు ఏమో బాగుంది అంటాడు, ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం అయ్యినట్టే అని నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Mokshagna Teja balakrishna
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here