Keerthy Suresh : కీర్తి సురేష్ పెళ్ళి వెనుక అంత కథ నడిచిందా?

- Advertisement -

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది..అయితే మహానటి లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.అంతేకాదు ఎన్నో అవార్డులను కూడా తెచ్చి పెట్టింది.ఆ సినిమా తర్వాత Keerthy Suresh కు సరైన హిట్ పడలేదు.అదే క్రమంలో ఈమె పెళ్ళి పై కూడా అనేక సార్లు రుమెర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లి నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

అంతేకాదు త్వరలోనే ఈ సొగసరి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు, ఆమె తల్లిదండ్రులు కూడా వరుడిని కూడా చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..కొంత మంది అబ్బాయిలను కూడా సెలెక్ట్ చేసారని తెలుస్తుంది. కీర్తి సురేష్ కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు టాక్‌ వినిపిసిస్తోంది. ఆ తర్వాత సినిమాలకు కూడా గుడ్ బై చెప్పనుందట..

- Advertisement -
Keerthy suresh
Keerthy Suresh

అయితే, వివాహానంతరం కీర్తీ సురేష్‌ నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై కీర్తి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.సౌత్‌ ఇండియన్‌ రాక్‌స్టార్‌ అనిరుధ్‌తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లికూడా చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే కీర్తి తల్లిదండ్రులు వాటిని కొట్టి పడేశారు. మరోవైపు సర్కారువారి పాట హిట్‌తో జెట్‌స్పీడ్‌లో దూసుకెళుతోంది కీర్తి.

ఆ మధ్యలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి వాశి అనే చిత్రంలో ఈ బ్యూటీక్వీన్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నాని సరసన ఆమె నటిస్తోన్న దసరా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోన్న భోళాశంకర్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. వీటితో పాటు మామన్నన్‌, సైరన్‌ సినిమాలలో నటిస్తుంది..ఈ సినిమాలు అన్నా అమ్మడుకు మంచి హిట్ ను ఇస్తాయెమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here