Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవికి గాడ్ ఫాదర్ సినిమా ఓ మాదిరి హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు చిరు తన ఆశలన్నీ వాల్తేరు వీరయ్య
పైనే పెట్టుకున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు..శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య
కు అతి పెద్ద మైనస్ లు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..ఈ సినిమాలో కొత్త కథను ఏమి చూపించలెదని తెలుస్తుంది.. రోటీన్ స్టోరీనే. ఈ విషయాన్ని చిరంజీవి విడుదలకు ముందుకే చెప్పేశారు. ఎప్పుడూ ఉన్నవిధంగానే సినిమా వుంది.. ఈ విషయాన్ని చిరంజీవి విడుదలకు ముందుకే చెప్పేశారు.. అయితే కథతో పాటు కథనం కూడా పరమ రొటీన్ గా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలిచింది. సెకెండాఫ్ లో సాగతీత సినిమాకు మరో మైనస్. సెకెండాఫ్ లో వచ్చే పలు సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి.
అలాగే బలహీనమైన భావోద్వేగాలు, క్లైమాక్స్ తేలిపోవడం సినిమాకు మైనస్ లుగా మారాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా పెద్దగా పండలేదు.. జనాలను మెప్పించలేక పోయింది.. చిరు, రవితేజ ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్, నిర్మాణ విలువలు, బాస్ పార్ట్ , పూనకాలు లోడింగ్ సాంగ్స్, శృతి హాసన్ గ్లామర్ సినిమాకు ప్లాస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా కథలో కొత్తదనం, పాత్రల్లో ఎలాంటి వైవిధ్యం లేకున్నా..జనాలు ముఖ్యంగా ఏవి కోరుకుంటూన్నారో వాటిని ఎక్కువగా చూపించారు.. మెగాస్టార్ ను కొత్తగా చూపించారు.. మొత్తానికి ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా జనాలను ఆకట్టుకోలేదు.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఫ్యాన్స్ ను మాత్రమే మెప్పించే సినిమా ఇది..ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..