VV Raj Kumar : నోటిదూల వల్ల అన్ని అవకాశాలు పోగొట్టుకున్నానన్న రాజ్ కుమార్

- Advertisement -

VV Raj Kumar : సినీ ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న సీనియర్ నటుడు రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన చూడడానికి చిరంజీవి లాగా ఉంటాడు.. ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా సీరియల్స్ లో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ తన నోటి దూల వల్లే కొన్ని ఆఫర్స్ పోగొట్టుకున్నానని చెప్పారు.

VV Raj Kumar
VV Raj Kumar


తమిళం లో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఒక సినిమా ద్వారా ఒక హీరో రావడం అంటే ఆరోజుల్లో చాలా పేరు ఉంది. నేను కూడా ఆయన ద్వారా సినిమా హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ కి వెళ్లాలి అని కూడా ఫిక్స్ అయ్యాము. అప్పుడు నేను నోరు మూసుకొని ఉండొచ్చు కదా నా నోటి దూల మూలన ఒక మాట నోరు జారి.. సినిమానే నాకు మొదటి సినిమా పైగా షూటింగ్ నాలుగు రోజులో షూటింగ్ కూడా ఉంది. డైరెక్టర్ దగ్గర అప్పుడే దాసరి నారాయణరావు నన్ను స్క్రీన్ టెస్ట్ చేశారని చెప్పాను అంతే బయటికి వెళ్లి కూర్చో అన్నారు. ఆ తరవాత వేరే అతను వచ్చి హీరో మార్చాలి అన్నారు. నా ప్లేస్ లో హీరో కార్తీ వచ్చారు.

తెలుగులో నేను చూడటానికి చిరంజీవి లాగా ఉన్నానని నన్ను రిజెక్ట్ చేశారు కానీ కన్నడలో మాత్రం నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. వరుసగా 6 సినిమాలు నటించాను నా నోటి దూలను కాస్త అదుపులో పెట్టుకొని ఉండుంటే ఈరోజు మంచి స్థాయిలో ఉండేవాడినని రాజ్ కుమార్ స్వయంగా మాట్లాడిన మాటలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక బుల్లితెర సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యానని ఆయన చెప్పుకొచ్చారు తన అభిమానులకు మిగతా వారికి కూడా నోటి దూల తగ్గించుకుంటే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటామని ఆయన చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here