Gangs of Godavari : ప్రస్తుతం విశ్వక్ సేన్ అంటే తెలియని వారుండరు. మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలె గామీ సినిమాతో సరికొత్త అనుభూతిని అభిమానులకు పంచారు విశ్వక్ సేన్. త్వరలో ఆయన నటించిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర ఆన్సర్లు ఇచ్చాడు విశ్వక్ సేన్. పోస్టర్ చూస్తే ఒకప్పుడు తారక్.. ఎన్నికల ప్రచారంలో దండం పెట్టారు. మీరు కూడా అలానే పెట్టినట్లు అనిపిస్తుందని విలేకరి అనగా.. విశ్వక్ నవ్వుతూ సార్ దండం ఎవరైనా అలానే పెడతారు సార్.. ఇలా రివర్స్ లో పెట్టలేరు కదా? అంటూ ఫన్ క్రియేట్ చేశాడు. ఆ పోస్టర్ బట్టి ఇది పొలిటికల్ డ్రామా అని అర్థమవుతుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గరనుంచి ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గతేడాది కాలంగా పలుమార్లు విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27 న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి విశ్వక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఎన్టీఆర్ గారు స్టార్ కంటే ముందు తనకు గొప్ప నటుడని విశ్వక్‍సేన్ ఆయనను ఆకాశానికి ఎత్తారు. ఎన్టీఆర్ అంత గొప్ప నటుడిని కావాలని ఉందని విశ్వక్ తన మనసులో మాట బయట పెట్టేశాడు. తన దృష్టిలో దేశంలో అందరి కంటే గొప్ప నటుడు ఎన్టీఆర్ అని విశ్వక్ సేన్ అన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తాను చేసిన లంక రత్నం రోల్.. తనకు డ్రీమ్ రోల్ గా అభివర్ణించాడు. తనకు వచ్చిన ‘మాస్ కా దాస్ ‘ అనే ట్యాగ్‍కు ఈ మూవీ ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందన్నాడు. అలాగే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందని నిర్మాత నాగవంశీ తెలిపారు . తాజాగా రిలీజ్ అయిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది . మాస్ గెటప్ లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు . ఈ మూవీ రిలీజ్ అయ్యాక అద్భుత విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉన్నారు.