తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రైటర్ గా, హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. తర్వలోనే ఆయన హోస్ట్ గా కూడా వ్యవహరించబోతున్నాడు. తెలుగు ఓటీటీ ఆహా నిర్వహిస్తున్న రియాలిటీ షో ఫ్యామిలీ ధమాకా
వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం విశ్వక్ ఆహాలో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే షోకు సంబంధించిన ప్రోమోలు బయటకు వచ్చాయి. ఈ రియాల్టీ షో గురించి వివరాలు తెలిపేందుకు నిన్న సాయంత్రం హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించింది షో బృందం. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. హీరోలందరూ పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తుంటే మీరేంటి ఓటీటీ షోకు హోస్ట్ గా చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకు విశ్వక్ సేన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

‘ఇమేజ్ పరంగా ఇండస్ట్రీలో ఉన్న మనం ఎన్నో లెక్కలు వేస్తాం. అది కొన్నిసార్లు పాన్ ఇండియా లెవల్ అని చేస్తే.. రిలీజ్ అయ్యాక అది గల్లీ సినిమా అవుతుంది. ఇది రూ. 200 కోట్లు, రూ. 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేసుకుంటే.. తీరా డిజాస్టర్ గా నిలుస్తుంది. ఒక్కోసారి చిన్న సినిమాలే సూపర్ హిట్ అయి పాన్ ఇండియా మూవీస్ గా మారుతున్నాయి. నా దృష్టిలో సినిమాల పరంగా ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు.. చేసుకుంటూ పోవడమే.` అంటూ విశ్వక్ సమాధానం ఇచ్చాడు. ఇది రూ. 200 కోట్లు, 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని తీసిన సినిమా రిలీజ్ అయ్యాక గల్లి సినిమా అయ్యిందన్న వ్యాఖ్య విజయ్ దేవరకొండ లైగర్ మూవీ గురించే అని.. కావాలనే విశ్వక్ సేన్ సెటైర్స్ వేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విశ్వక్ సేన్ కు నోటి దూల ఎక్కువైంది తగ్గించుకుంటే మంచిదంటూ ఫైర్ అవుతున్నారు.
