Vishwak Sen ప్రస్తుతం విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘మాస్ కా ధమ్కీ’.ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు , ఆయనే నిర్మాత కూడా.ఇప్పటి వరకు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఈ చిత్రం కోసం ఖర్చుపెట్టేసాడట.అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించుకున్నాడు.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఈ సినిమాకి పై ఉన్న క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాలలో అదిరిపోయాయి.చూస్తూ విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ పక్కా అని అర్థం అయిపోతుంది.టీజర్ మరియు పాటలకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ని జారీ చేసారు.
సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకి వచ్చిన టాక్ ఇప్పుడు ఫీల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ప్యాకేజి ఎంటర్టైన్మెంట్ ఉన్న కమర్షియల్ సినిమాని చూశామని సెన్సార్ సభ్యులు విశ్వక్ సేన్ కి శుభాకాంక్షలు తెలియజేశారట.మూవీ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసినప్పటికీ కూడా మాస్ ఆడియన్స్ నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయట.అంతే కాదు మూవీ ఉన్న ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం.
విశ్వక్ సేన్ ఈ సినిమా తో తన మార్కెట్ ని మూడింతలు ఎక్కువ చేసుకోవడం తథ్యం అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్.ఈ చిత్రం లో నివేత పేతు రాజ్ తన అందం తో పాటుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రై గా ఉంది, ఈ సినిమా ద్వారా మళ్ళీ జనాలు థియేటర్స్ కి క్యూలు కడుతారని ఆశిస్తున్నారు ట్రేడ్ పండితులు.మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఎంతమేరకు రీచ్ అవుతుందో చూడాలి.