Vishal : తెలుగు గడ్డపై పుట్టినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విశాల్. తన నటనతో కోలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయనకు అక్కడ కోట్లాదిమంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచారు. విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. రీల్ పైనే కాకుండా హీరో విశాల్ నిజ జీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఎదుటి వారు ఆపద అంటే తానున్నానంటూ చేయి అందించే నైజం అతడిది.
ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వెళ్లి ఆదుకుంటారు. తాజాగా విశాల్ షూటింగ్ కు వెళ్లిన ఓ గ్రామంలోని ప్రజల అవసరాలను తీర్చి మరో సారి తన మంచి తనాన్ని రుజువు చేసుకున్నాడు. విశాల్ ఆ గ్రామస్తుల దాహార్తిని తీర్చి ప్రశంసలు అందుకున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ సమాజ సేవతో అభిమానులకు నిత్యం దగ్గరవుతూనే ఉన్నాడు.

దేవి ఫౌండేషన్ విడుదల చేసిన ఫోటోల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారచక్రపురం అనే గ్రామానికి వెళ్లిన విశాల్ అక్కడి ప్రజల తాగునీటి అవసరాన్ని తెలుసుకున్నాడు. వెంటనే తన సొంత ఖర్చులతో బోరుబావిని తవ్వించడంతో పాటు 5000 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సింథటిక్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశాడు. ఆరు ట్యాప్‌ల ద్వారా నీళ్లు పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశాడు.
గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తీర్చడంతో అక్కడి ప్రజలు విశాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలి.. విశాల్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇటీవల విశాల్ రెమ్యునరేషన్ భారీగా పెరిగిందట.. కానీ తెలుగులో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ తీస్తే బాగుంటుందని ఇక్కడి అభిమానులు కోరుకుంటున్నారు.