Virupaksha Trailer Review : థ్రిల్లింగ్ కి గురి చేసిన ‘విరూపాక్ష’ ట్రైలర్.. సాయి ధరమ్ తేజ్ కూడా 100 కోట్లు కొట్టేయబోతున్నాడా!

- Advertisement -

Virupaksha Trailer Review : విభిన్నమైన కథాంశాలతో వస్తున్న సినిమాలకు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ఉంది.హీరో ఎవరు అనేది చూడకుండా కంటెంట్ ని నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తున్నారు ఆడియన్స్.అందుకే మేకర్స్ కూడా అలాంటి స్కోప్ ఉన్న కథలకే ఎక్కువ ప్రాముఖ్యత చూపిస్తున్నారు.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్ష’ కూడా ఆ కోవకి చెందినదే.ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే ఈ చిత్రం పై ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి.

Virupaksha Trailer Review
Virupaksha Trailer Review

స్క్రిప్ట్ ఎంపిక విషయం లో సాయి ధరమ్ తేజ్ రూట్ మార్చాడు,ఇక ఆయనకీ మంచి రోజులు ప్రారంభం అయ్యినట్టే అని ఫ్యాన్స్ కూడా సంతోషపడ్డారు.టీజర్ విడుదలైనప్పుడు ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరిపోయింది.మార్కెట్ లో కూడా మంచి బజ్ ఏర్పడింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా 22 కోట్ల రూపాయలకు జరిగింది.

ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పాన్ అన్నీ బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది.ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇంత తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన క్వాలిటీ మేకింగ్ చెయ్యడం లో డైరెక్టర్ కార్తీక్ దండు టాలెంట్ ఏంటో అర్థం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

థ్రిల్లింగ్ కి గురి చేసే మూఢనమ్మకాల కాన్సెప్ట్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ మార్కు ఎంటర్టైన్మెంట్ మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ తో ఒక లవ్ ట్రాక్ కూడా ఉన్నట్టు అర్థం అవుతుంది. క్రియేటివ్ జీనీస్ సుకుమార్ అందించిన కథ మరియు స్క్రీన్ ప్లే కాబట్టి కచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని, వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా తో చేరుకోబోతున్నాడని తెలుస్తుంది.మరి ట్రైలర్ కి తగ్గట్టుగానే సినిమా ఉంటుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here