Virupaksha: సమ్మర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ట్రేడ్ కి ‘విరూపాక్ష’ రూపం లో పెద్ద జాక్పాట్ తగిలింది అనే చెప్పాలి.టాక్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రావడం తో మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా దుమ్ము లేపేసింది.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు 7 కోట్ల 20 లక్షలు మరియు మూడవ రోజు 7 కోట్ల 10 లక్షల రూపాయిల వసూళ్లను రాబట్టింది.
ఈ సమ్మర్ లో దసరా పెద్ద హిట్ గా నిల్చింది కానీ, అది కేవలం తెలంగాణ మరియు ఓవర్సీస్ మర్కెట్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది.కానీ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ మరియు ఓవర్సీస్ అని తేడా లేకుండా ప్రతీ చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రాబడుతుంది ‘విరూపాక్ష’ చిత్రం.
మూడు రోజు విపరీతమైన కలెక్షన్స్ వచ్చిన తర్వాత వర్కింగ్ డే వసూళ్లు ఘననీయంగా తగ్గిపోవడం అనేది సర్వసాధారణం.కానీ ‘విరూపాక్ష‘ చిత్రం నాల్గవ రోజు, అనగా వర్కింగ్ డే కూడా కళ్ళు చెదిరే వసూళ్లను నమోదు చేసుకుంది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా నాల్గవ రోజు 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.విడుదలకు ముందు ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 24 కోట్ల రూపాయలకు జరిగింది.
నిన్నటితో ఈ చిత్రం 24 కోట్ల రూపాయిల మార్కుని దాటేసి, లాభాల్లోకి అడుగుపెట్టింది.ఇదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తే ఫుల్ రన్ లో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.ఇప్పటి వరకు గ్రాస్ లెక్క వేస్తె 60 కోట్ల రూపాయలకు దగ్గరగా వచ్చింది.USA లో కూడా ఈ చిత్రం రేపటితో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకోనుంది.