పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది. ఫలితం సంగతి పక్కనబెడితే ట్రోలింగ్ మాత్రం ఓ రేంజ్‌లో జరుగుతోంది. కథ, పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వీఎఫ్ఎక్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డైలాగ్స్‌పై వివాదం నెలకొంది. కొన్ని డైలాగ్స్ మార్చినా.. అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆదిపురుష్‌పై స్పందించాడు. తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశాడు.

ప్రభాస్ బ్లాస్‍బాస్టర్ సినిమా బాహుబలిని ప్రస్తావిస్తూ వీరేందర్ సెహ్వగ్ ఈ ట్వీట్ చేశాడు. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఆదిపురుష్ చూశాక నాకు అర్థమైంది”అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆదిపురుష్‍పై వ్యంగంగా జోక్‍లా ఇలా ట్వీట్ పోస్ట్ చేశాడు. అయితే, ఇలాంటి ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు వీరూకు మద్దతు తెలుపుతుంటే.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరూను కొందరు ట్రోల్ చేస్తున్నారు. మరికిందరేమో ఓంరౌత్ కావాలనే ప్రభాస్ ను వెన్నుపోటు పొడిచారంటారా అని కామెంట్స్ చేస్తున్నారు.

జూన్ 16న ఆడియన్స్ ముందుకు రాగా.. పూర్తిగా నిరాశపర్చింది. దాదాపు రూ.500 కోట్లతో రూపొందించిన ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్.. జానకీదేవిగా కృతి సనన్ యాక్ట్ చేశారు. రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. తొలి మూడు రోజులు మాత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఆదిపురుష్.. ఆ తరువాత కలెక్షన్ల పరంగా వెనుకబడిపోయింది. ఇప్పటివరకు మొత్తం రూ.400 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగులో 100 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టీజర్, ట్రైలర్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఆదిపురుష్ భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.
Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀
— Virender Sehwag (@virendersehwag) June 25, 2023