Chiranjeevi కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాణసంస్థ.. కొత్త సినిమా మొదలుకాకముందే తలనొప్పులు..

- Advertisement -

Chiranjeevi : ఒకప్పుడు హిట్ అందుకున్నా సినిమాలకు సంబంధించిన ఒక లైన్ తీసుకొని.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది.. ఇక ఇవన్నీ ఇప్పుడెందుకు వచ్చాయి అంటే.. బింబిసార సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. మొదటి సినిమా పీరియాడిక్ డ్రామా తెరకెక్కించడమే గొప్ప అనుకుంటే.. హిట్ అందుకొని మెగాస్టార్ కంట్లో పడడం మరింత గొప్ప అని చెప్పాలి. ఇక రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 ను మొదలుపెట్టాడు.

Chiranjeevi
Chiranjeevi

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పంచభూతాలను కలిపిన కథతో వశిష్ఠ రానున్నాడని తెలుస్తోంది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కుర్ర డైరెక్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి కథ ఆధారంగా కొన్ని సీన్స్ రాసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా అందులోని కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తోంది. దీంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నిర్మాతలు ముందుగానే వార్నింగ్ ఇచ్చారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Mega 157

జగదేక వీరుడు అతిలోక సుందరి కు సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ, సీన్స్ రీ క్రియేట్ చేయడం కానీ, కనీసం ఆ కథ ఆధారంగా మరో కథను రాసుకోవడానికి కూడా వీల్లేదని, అలా చేస్తే లీగల్ చర్యలు తప్పవు అని చెప్పుకొచ్చారు. అయితే వైజయంతీ మూవీస్ ఇచ్చిన వార్నింగ్ మెగా 157 కే అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here