తమన్నా మాత్రమే అలా హాట్ గా నటించగలదు.. తెగ పొగిడేసిన ప్రియుడు

- Advertisement -

గతకొన్ని రోజులుగా టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తమన్నా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయ్ వర్మతో రిలేషన్ నిజమే అంటూ కుండ బద్దలు కొట్టింది. రియల్‌ లైఫ్‌ ప్రేమ జంట తమన్నా-విజయ్‌ వర్మ నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌2’ . తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈనెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని షురూ చేసింది నిర్మాణ సంస్థ. తాజాగా విజయ్‌ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమన్నాతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.

తమన్నా
తమన్నా

‘‘తొలుత స్క్రిప్ట్‌ చదవగానే హీరోయిన్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను. తమన్నా అని చెప్పగానే సరైన ఎంపికగా అనిపించింది. నిజానికి ఆ పాత్రకు ఆమె కరెక్ట్‌గా సరిపోయింది. దానికి మరింత గ్లామర్‌ను తెచ్చింది. తను నటించే పాత్రలో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తుంది. చాలా శ్రద్ధగా పని చేస్తుంది. ఆమె మాత్రమే అలా చేయగలదు. మన తోటి నటీనటులు ఉత్సాహంగా ఉన్నప్పుడు షూటింగ్‌ సరదాగా ఉంటుంది. ఆమె ఐకాన్‌. నేను తమన్నా నటించిన ‘బాహుబలి’ని థియేటర్లో చూశా.. తాజాగా ఆమె నటించిన ‘బబ్లీ బౌన్సర్‌’ను చూశాను వాటిల్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. లస్ట్‌ స్టోరీస్‌-2 చూశాక మీరంతా కూడా ఆమె నటనను ప్రశంసిస్తారు’’ అని చెప్పాడు.

Tamanna

కాగా, తాజాగా విజయ్ వర్మ సైతం వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై నోరు విప్పాడు. తమ మధ్య ఉన్నది ప్రేమ బంధం అని తెలిపాడు. ఇదే సందర్భంలో తమన్నాతో బంధం గురించి ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘ప్రస్తుతం నా జీవితం ప్రేమతో నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

- Advertisement -

ప్రజలకు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పాలని అనుకున్నా. పర్సనల్ లైఫ్ గురించి సమయం వచ్చినప్పుడు బహిర్గతం చేయాలనున్నా. అందుకే తమన్నాతో నా ప్రేమ విషయం బయటపెట్టలేదు’ అని తెలిపాడు. విజయ్ వర్మతో తనకున్న బంధం గురించి తమన్నా ఇటీవల పెదవి విప్పిన విషయం తెలిసిందే. ‘లస్ స్టోరీస్ 2’ సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైనట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here