దాని కోసం సిగరెట్లు.. మందు మానేశాను.. పబ్లిక్ గా చెప్పిన శ్రుతి హాసన్

- Advertisement -

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదుంది శృతి హాసన్. ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం.యంగ్‌ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్‌ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇలాంటి విషయాలను పట్టించుకోనని ఆ మధ్య చెప్పేశారు శృతి హాసన్ అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శృతి హాసన్ కాస్త విభిన్నం.

శృతి హాసన్
శృతి హాసన్

గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు’, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వాళ్లతో షేర్‌ చేసుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు కూడా సరదాగా సమాధానం చెబుతుంటుంది.

shruti haasan

తాజాగా శ్రుతి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. సినిమా షూటింగ్‌ బ్రేక్‌లో అభిమానులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పింది. ‘మీరు సిగరెట్లు, మద్యం తాగుతారా?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. దానికి శృతి హాసన్ చెప్పిన సమాధానం ఆకట్టుకుంటోంది. ‘‘నేను హుందాగా జీవిస్తున్నాను. అందుకే సిగరెట్లు, మద్యం తీసుకోవడం లేదు. ఇంత మంచి జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. ఇక గతంలోనూ శృతి హాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇదే సమాధానమిచ్చింది. ఆరు సంవత్సరాల నుంచి సిగరెట్లు, మద్యానికి దూరంగా ఉంటున్నట్లు చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here