Vijay Thalapathy : రష్మిక వల్లే విజయ్ విడాకులు తీసుకుంటున్నారా.. అసలు నిజమేంటి?

- Advertisement -

Vijay Thalapathy : ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా మంది జంటలు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు.. ఇప్పటికే ఎంతో మంది విడాకుల వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి.. చాలా మంది విడి పోయారు కూడా.. స్టార్ హీరో దళపతి విజయ్, సంగీత విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. త్వరలో వీరిద్దరూ విడిపోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..తన వీరాభిమాని సంగీతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. విజయ్ ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని అంటున్నారు..

Vijay Thalapathy
Vijay Thalapathy

ఈ పుకార్లకు కారణం లేకపోలేదు. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడిగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ రాబోయే చిత్రం వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్‌కు ఆయన భార్య సంగీత గైర్హాజరైంది. అంతే కాకుండా విజయ్, రష్మిక క్లోజప్ ఫోటోలు వైరల్ అయ్యాయి.రష్మిక క్రీమ్ కలర్ చీరలో కనిపించగా, విజయ్ క్యాజువల్ లుక్‌లో స్టేజ్‌పై కనిపించాడు. అయితే సాధారణంగా విజయ్ దళపతి ఏ సినిమాకి సంబంధించిన ఏ ప్రోగ్రాం వచ్చినా అతని భార్య సంగీత మిస్ అవ్వదు.

అయితే ఈ సారి వారిసు ఆడియో లాంచ్ ఈవెంట్‌కు రాకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తుంది.. విజయ్, సంగీత వివాహమై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. వీరి మధ్య ఎలాంటి మనస్పర్థలు, విడాకులు లేవని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, కొన్నిరోజులుగా విజయ్ విడాకుల వార్తలు రావడంతో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు స్పందించారు.

- Advertisement -

విడాకుల గురించి విజయ్, సంగీత సన్నిహిత వర్గాలు స్పందించాయి. అలాంటి విషయం ఏమీ లేదన్నారు. సంగీతా, పిల్లలు విదేశాల్లో ఉన్నారని అందుకే ఆ ఈవెంట్ కు రాలేదని తేల్చి చెప్పారు.. వీరిద్దరి విడాకులకు రష్మిక కారణమని అనడం తో మధ్యలో రష్మిక పేరు ఎందుకు చెడగొడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వారిసు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here