సీనియర్ నటుడు నరేష్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కథలుకథలుగా చెప్తున్నారు.. ఒకప్పుడు వరుస సినిమాలలో పలు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించిన ఆయన ఇప్పుడు ఒక్క సినిమాకోసం పరువు తీసుకుంటున్నాడానికి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..నరేష్,నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయాణం పై గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కానీ అదంతా సినిమా స్టెంట్ అంటూ బాంబ్ పెల్చారు.. అయితే ఇప్పుడు నరేష్, పవిత్రలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మళ్ళీ పెళ్లి.. ఈ సినిమా పై ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా.. మరోవైపు క్రేజ్ ను అందుకుంటూ వస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి..

తాజాగా విడుదలైన ట్రైలర్ పై విమర్శలు ఎదుర్కొంటుంది.. ఈ సినిమా మొత్తం బూతులే.. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు, నరేష్ జీవితం ఇలా ఉందా అంటూ తీవ్ర ఆరోపణలు ఎదురవుతున్నాయి.. అయితే ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎన్నో పచ్చి నిజాలు బయటపడ్డాయి.. ఇక తాజాగా ఈ పెళ్లి పై నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు..తండ్రి నాలుగో పెళ్లి వ్యవహారం, మీడియాలో వరుస కథనాలు అతనిని బాగా డిస్టర్బ్ చేశాయి. పర్సనల్ లైఫ్ డిజాస్టర్ గా ఉన్న సమయంలో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది. పైగా తన తండ్రి మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఒక సినిమా చేస్తూ ఉండడం నిజంగా వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుందట.

ఇక తండ్రి చేస్తున్న పనుల వల్ల వారు హ్యాపీగా లేనట్టు తెలుస్తోంది. అంతేకాదు తన తండ్రి హోటల్ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం, సోషల్ మీడియా ముందు వెకిలి వేషాలు వేయడం వల్ల ఫ్యామిలీ పరువు కూడా పూర్తిగా పోయింది.. తండ్రి ప్రవర్తన ఎవరికి నచ్చకపోవడంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నవీన్ విజయకృష్ణ బయటకు రావడంలేదని సమాచారం అంతేకాదు వికే నరేష్ తన తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు సిగ్గుగా ఉంది అన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. మరి దీనిపై నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ సినిమా కోసం నరేష్ నవ్వుల పాలు అయ్యారన్నది మాత్రం నిజం.. చూద్దాం ఏమౌతుందో..