Vijay Deverakonda : పెళ్లి కాకపోయినా నాకు అన్నీ అయ్యాయి.. ఇన్ డైరెక్ట్ గా చెప్పిన విజయ్ దేవరకొండ

- Advertisement -

సినిమాల గురించి, పర్సనల్‌ లైఫ్‌ గురించి.. ఇలా Vijay Deverakonda ఏది మాట్లాడినా వైరల్‌ అయిపోతూ ఉంటుంది. తాజాగా తన కొత్త సినిమా ‘ఖుషి’ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం ఆయన ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత జీవితాన్ని లింక్‌ చేసి మాట్లాడటమే. ‘ఖుషి’ నుంచి ఇటీవల విడుదలైన ప్రేమ గీతం ‘ఆరాధ్య..’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలకు ముందు విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను వివాహం చేసుకున్నాక ఈ పాటలో చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Vijay Deverakonda
Vijay Deverakonda

‘‘ఖుషి’లో నాకు ఇష్టమైన పాటల్లో ‘ఆరాధ్య..’ ఒకటి. వివాహం చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించారు. ఈ పాటను చూస్తుంటే నాకు నా తీపి గుర్తులు గుర్తుకు వస్తున్నాయి.

నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ, భవిష్యత్తులో నా వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నా’’ అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. ఇక సినిమా విషయానికొస్తే… శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తొలుత వచ్చిన ‘నా రోజా నువ్వే..’ పాట కూడా సూపర్‌ హిట్‌ అయ్యి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

గత కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల డిన్నర్‌ డేట్స్‌, హాలీడే వెకేషన్స్‌కు వెళ్లి రావడం ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అయితే తమ మధ్య అలాంటిది ఏమీ లేదని, కేవలం స్నేహం మాత్రమే ఉందని ఇప్పటికే ఈ జంట ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి విజయ్‌ తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో వాళ్ల ప్రేమ టాపిక్‌ మళ్లీ చర్చలోకి వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here