విజయ్ దేవరకొండ ఒకప్పుడు 10వేల కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా?

- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావు…కనీసం తినడానికి డబ్బులు లేక చాలా కష్టాలు పడ్డాడు… పది వేలు సంపాదించడానికి చాలా కష్టపడ్డాడు. పది వేల కోసం దేనికైనా సిద్ధంగా ఉండేవాడినని… సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడినని… ఎవరైనా ఏదైనా పని అడిగితే డబ్బు కోసం ఆ పని చేసేవాడినన్న విషయాన్ని విజయ్ దేవరకొండ ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆస్తుల విలువ 80 నుంచి 90 కోట్లు. అతడికి ఇప్పుడు కార్లు, బంగ్లాలు, స్థలాలు ఉన్నాయి. మధ్యలో చాలా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అతని గ్యారేజీలో కోట్ల విలువైన కార్లు, ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు రౌడీ వేర్ బట్టల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మ్యారేజ్ చేసుకోబోతున్నారనీ… వారిద్దరూ లవ్లో ఉన్నట్లు పలురకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై వారిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని… త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు షేర్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here