Sudigali Sudheer : నా కంటే నువ్వే ఫేమస్ భయ్యా.. సుడిగాలి సుధీర్ ను ఆట ఆడుకున్న విజయ్ దేవరకొండ..

- Advertisement -

Sudigali Sudheer : టాలీవుడ్ లో కొన్ని లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఆన్ స్క్రీన్ పై లవర్స్ గా ఆకట్టుకున్న జంట రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే చూడాలని ఆడియన్స్ ఆశపడుతుంటారు. ఈక్రమంలోనే ఆయా జంటలకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలా టాలీవుడ్ బాగా ఫేమస్ అయిన రెండు లవ్ స్టోరీస్.. సుడిగాలి సుధీర్ అండ్ రష్మీ గౌతమ్, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న. ఈ రెండు లవ్ స్టోరీస్ కి టాలీవుడ్ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆన్ స్క్రీన్ పై ఆకట్టుకుంటున్న ఈ లవ్ స్టోరీస్.. రియల్ లైఫ్ లో నిజామా లేదా అనేది మాత్రం ఇప్పటికీ ఓ ప్రశ్నగానే ఉండిపోయింది.

తాజాగా ఈ రెండు లవ్ స్టోరీస్ లోని వ్యక్తులు ఓ వేదిక పై కలుసుకున్నారు. ఇన్నాళ్లు సినిమాల్లో హీరోగా చేయాలంటూ టీవీ షోలకు దూరంగా ఉన్న సుడిగాలి సుధీర్.. ఈ ఉగాది స్పెషల్ షోతో మళ్ళీ బుల్లితెర ఆడియన్స్ ముందుకు వస్తున్నారు.ఇక ఈ షోకి ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో సుధీర్, విజయ్ తో మాట్లాడుతూ.. ‘పెళ్లికాని యువతికి ఏమైనా టిప్స్ ఇవ్వండి’ అని అడిగారు. దానికి విజయ్ బదులిస్తూ..

- Advertisement -

“నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ నిత్యం వార్తల్లో ఉంటుంది. నాకంటే సీనియర్ నువ్వు. నీకు నేను ఇచ్చేది ఏంటి” అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here