Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ సహా మూవీ టీమ్ చాలా జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియల్స్ నటీమణులతో విజయ్ దేవరకొండ ముచ్చటించారు.
ఫ్యామిలీ స్టార్‌తో కిట్టీ పార్టీ అంటూ ఈ చిట్‍చాట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‍కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో వారు సైలెంట్‍గా ఉన్నా.. వారు లవ్‍లో ఉన్నారని కొన్నిసార్లు పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చారు. అయితే, యాదృచ్ఛికంగా రష్మిక పుట్టిన రోజైన ఏప్రిల్ 5వ తేదీనే ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. దీనిపై విజయ్‍కు ఈ కిట్టీ పార్టీలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రీలీజ్ అవుతోంది కదా.. ఆ తేదీన ఏదైనా స్పెషాలిటీ ఉందా అని విజయ్ దేవరకొండను ఓ నటి అడిగారు.
దీనికి స్పందిస్తూ చాలా హాలీడేస్ ఉన్నాయి ఆ సమయంలో అని విజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వారు. “కోఇన్సిడెన్స్ ఇంకేదో ఉంది.. అదే రష్మిక మంధాన బర్త్‌డే అనుకుంటా” అని వారు అడిగారు. దీనికి విజయ్ ఆన్సర్ ఇచ్చాడు. “అవును రష్మిక బర్త్‌డే. అది మాకు లక్కీ అవుతుందని అనుకుంటున్నా” అని విజయ్ దేవరకొండ అన్నారు.