Chiranjeevi : 200 మంది అరిచారు.. తనకు జరిగిన అవమానాన్ని చెప్పిన చిరంజీవి.. హ్యాట్సాఫ్ అంటోన్న ఫ్యాన్స్..

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమని రాజులా ఏలారు. ఆయన సక్సెస్ లు, కోట్లాది మంది అభిమానులు, ఎన్నో మంచి పనులు.. అందరూ చూస్తున్నవే. అయన సినిమా వచ్చిందంటే చొక్కాలు చింపుకొని మరీ టికెట్ల కోసం లైన్లో కొట్టుకునే వాళ్ళు. అయన ఎక్కడికి వెళ్లొచ్చినా ఇప్పటికి తన అభిమానుల కోసం మళ్ళీ వచ్చి సినిమాలు చేస్తున్నారు. కానీ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిగా ఎదగడానికి మాత్రం ఎన్నో కష్టాలు, అవమానాలు పడ్డారు. తాజాగా ఓ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో చిరంజీవి కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా తన కెరీర్ మొదట్లో జరిగిన ఓ సంఘటనని పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘కెరీర్ మొదట్లో న్యాయం కావాలి సినిమా క్లైమాక్స్ షూట్ అప్పుడు మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చారు. నేను సెట్ బయటకి వెళ్లి నిల్చున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అంటే వెళ్ళాను. హాళ్ళో జూనియర్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో పాటు శారద, జగ్గయ్య.. లాంటి సీనియర్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. అందరి ముందు నిర్మాత క్రాంతి కుమార్ నా మీద గట్టిగా అరిచారు నేను లోపలికి వెళ్ళగానే. నువ్వేమన్న సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నిన్ను ఇంకొకరు పిలవాలా? అంటూ అరిచాడు. నేను బ్రేక్ ఇస్తేనే బయట నిల్చున్నా, పిలవగానే వచ్చాను దాంట్లో నా తప్పేమి లేకపోయినా అలా దాదాపు 200 మంది ముందు నా మీద అరవడంతో చాలా అవమానంగా ఫీల్ అయ్యా.

- Advertisement -

ఆ రోజు భోజనం కూడా తినాలనిపించలేదు. ఆ మాటలు నా మైండ్ లో బలంగా ఉండిపోయాయి. రాత్రికి ల్యాండ్ లైన్ కాల్ చేసి ఆయన మళ్ళీ దాని గురించి ఏదో రీజన్స్ చెప్తూ అరిచానని మాట్లాడారు. కానీ అది నా మైండ్ లో ఉండిపోయి అవును నేను సూపర్ స్టార్ కాదు, కానీ అయి చూపిస్తా అని ఫిక్స్ అయ్యాను’’ అని తెలిపారు. అలాంటివి తన లైఫ్ లో చాలా జరిగాయని, అన్ని జరగడం వల్లే నేను ఈ పొజిషన్ కి కసితో ఎదిగానని అన్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ అన్ని కష్టాలు పడ్డారు కాబట్టే స్టార్ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here