Ranbir Kapoor : అమ్మ నగలు అమ్మి గర్ల్ ఫ్రెండ్ కు నగలు కొన్న స్టార్ హీరో.. ఇప్పుడు ఒక బిడ్డ తండ్రి..

- Advertisement -

Ranbir Kapoor : బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రణబీర్ కపూర్ అలియా భట్ ఒకరు. ఈ జంట చాలా కాలం ప్రేమాయణం సాగించి పెళ్లి పీటలెక్కారు. ఈ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లోనూ నటించారు. అలియా కంటే ముందు రణబీర్ దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణం సాగించాడని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక 2022 ఏప్రిల్ 14న అలియా భట్ ను వివాహం చేసుకున్నాడు రణబీర్. వీరికి ఓ కూతురు కూడా ఉంది. రణబీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు అలియా భట్ కూడా సినిమాలు చేస్తోంది.

Ranbir Kapoor
Ranbir Kapoor

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో ఓ టీవీ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు రణబీర్ కపూర్. ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ బాలీవుడ్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి రణబీర్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో రణబీర్ ను చిత్ర విచిత్ర ప్రశ్నలడిగాడు కపిల్ శర్మ.. నీ పెళ్లిలో ఆలియా సిస్టర్స్, స్నేహితులకు బాగానే డబ్బులిచ్చావట గా నిజమేనా.? వాళ్లు నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల వరకు డిమాండ్‌ చేశారని తెలిసింది.. దాని నువ్వు బేరమాడి లక్షరూపాయలు ఇచ్చవట కదా..! అని అడిగాడు కపిల్.

Ranbir Kapoor Alia Bhatt

- Advertisement -

దానికి రణబీర్ కపూర్ నవ్వుతూ.. మేము పెళ్లి చేసుకుంది ఇంట్లోనే.. ఒకవేళ వాళ్లు నా చెప్పులు దాచిపెట్టిన అవి ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవు అని సరదాగా సమాధానం చెప్పాడు. దానికి కపిల్ మాట్లాడుతూ.. నా పెళ్లిలో కూడా ఇలా చెప్పులు దాచి పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. నన్ను రూ. 11 లక్షలు ఇవ్వాలని అన్నారు.. దానికి నేను మీ చెల్లితో పాటు ఆ చెప్పులు కూడా మీరే ఉంచుకోండి అని చెప్పాను అని నవ్వులు పూయించాడు. ఆతర్వాత రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. తన గర్ల్ ఫ్రెండ్స్ కు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన తల్లి నగలు అమ్మి తన ప్రియురాళ్లకు గిఫ్ట్స్ కొనిచ్చా నాని తెలిపి షాక్ ఇచ్చాడు రణబీర్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here