RGV Comments: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆగస్టు 11న విడుదలైన సినిమా రెండు రోజుల్లో కూడా మామూలు సినిమాలకు వచ్చే కలెక్షన్లను తీసుకురాలేక పోయింది. బాక్సాఫీసుకే బాస్ అయిన మెగాస్టార్ సినిమా రిజల్ట్ లో ఆయన స్టార్ డమ్ పనిచేయలేదు. దీంతో వసూళ్లు భారీగా నీరసించాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్ మెహర్ రమేష్ ను ఎలా నమ్మి ఛాన్స్ ఇచ్చాడో అంటూ మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా రీమేకులకే ప్రాధాన్యం కలిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా చిత్రం భోళా శంకర్ కూడా తమిళంలో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గానే తెరకెక్కింది. అక్కడ హిట్ గా నిలిచిన వేదాళం సినిమా.. రీమేక్ గా వచ్చిన భోళా శంకర్ తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా.. దానిని లేపేందుకు ప్రయత్నిస్తున్నారు.

పైకి చెప్పకపోయిన లోలోపల మాత్రం వారు చాలా అసహనంగానే ఉన్నారు. అంచెలంచెలా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఇమేమ్ డ్యామేజ్ చేసే విధంగా భోళా శంకర్ మూవీ ఉండడం వారికి అసలు మింగుడు పడడం లేదు. విడుదలకు ముందు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. కానీ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తు్న్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంతమంది చాలా అతిగా మాట్లాడడం కూడా ఈ సినిమా అనర్థాలకు దారి తీసిందని చెప్పొచ్చు. రీసెంట్ గా రాంగోపాల్ వర్మ కూడా కొన్ని ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. ఆయన మొదటి ట్వీట్లో.. చిరంజీవి కొంతమంది పొగడ్తలకు పడిపోయి కథల విషయంలో పొరపాటు చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం తాజాగా మరో ట్వీట్ చేసి చర్చకు తెరలేపారు. ఈ ట్వీట్లో ఆర్జీవీ.. ‘వాల్తేరు వీరయ్య సినిమా ఎవరి మూలాన ఆడిందో ప్రూఫ్ చేయడానికి తీసినట్లు ఉంది బీఎస్’ అంటూ ట్వీట్ చేశారు.. వాస్తవానికి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలకపోత్ర పోషించారు. ఆ కారణంగానే సినిమా బాగా ఆడిందని ఫ్రూప్ చేసేందుకు భోళా శంకర్ సినిమా చేసినట్లు ఉందంటూ అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ ఉంది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
