‘బేబీ’ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్..రాజమౌళికి కూడా ఈ అరుదైన రికార్డుని కొట్టడం అసాధ్యమే!

- Advertisement -

రీసెంట్ సమయం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బేబీ’. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదలై స్టార్ హీరోల సినిమాలకంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బేబీ
బేబీ

మంచి కంటెంట్ ని ఇస్తే తెలుగు ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరిస్తారో అని చెప్పడానికి నిదర్శనం ఈ సినిమా. అలా దిగ్విజయంగా ఇన్ని రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేసిన ఈ సినిమా రన్ నిన్నటితో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్నీ థియేటర్స్ లో కూడా కొత్త సినిమాల విడుదల కారణం గా తీసివెయ్యాల్సి వచ్చింది. కొన్ని ముఖ్యమైన నగరాలలో నిన్నటి వరకు నడిచింది కానీ, రేపటి నుండి షేర్ వసూళ్లు రావడం కష్టమే.

సుమారుగా నెల రోజుల పాటు దుమ్ము లేపే వాసూవళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా ఫుల్ రన్ లో 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఈ ఏడాది నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన టాప్ 3 మూవీస్ లో బేబీ ఒకటిగా నిల్చింది. ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 39 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది. అంటే దాదాపుగా 7 రెట్లు లాభాలు అన్నమాట.

- Advertisement -

దీనితో పాటుగా సాటిలైట్ రైట్స్ అలాగే ఓటీటీ రైట్స్ కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అలా ఓవరాల్ గా ఈ సినిమా 45 కోట్ల రూపాయిల షేర్, 90 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టు చెప్తున్నారు. కోత సినిమాలు విడుదల కాకపొయ్యుంటే ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం కంటే డైలీ షేర్స్ ఎక్కువ రాబట్టినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here