Venu Swamy : జ్యోతిష్యం పేరుతో సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం జనాలతో తిట్టించుకుంటూ ఉండే వ్యక్తి వేణు స్వామి. సమంత తో నాగ చైతన్య విడాకులు తీసుకుంటుంది అని మొట్టమొదట చెప్పింది ఈయనే. అది నిజం అవ్వడం తో ఈయనకి క్రేజ్ పెరిగింది. అప్పటి నుండి ఈయన చెప్పిన వాటిల్లో రెండు మూడు నిజం అయ్యాయి. ప్రభాస్ కి ఇప్పట్లో హిట్ రాదు అన్నాడు. మొన్న ‘సలార్’ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అంటున్నారు కానీ, కమర్షియల్ గా ఆ చిత్రం యావరేజి గానే నిల్చింది.
దీంతో వేణు స్వామి చెప్పింది మళ్ళీ నిజం అయ్యినట్టు అయ్యింది. దీంతో ఈయనపై పలువురి సెలెబ్రిటీలు మరింత నమ్మకం పెంచుకున్నారు. ఈయన ఎవరో జ్యోతిష్యం ని చాలా కామెడీ గా చెప్పేస్తున్నాడు. అవి నిజం అవుతున్నాయి కూడా, ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అని కెరీర్ సరైన పద్దతిలో లో లేని ఎంతో మంది హీరోయిన్స్ ఆయన్ని కలిసి శాంతి పూజలు చేయించుకున్నారు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ ఇనాయ సుల్తానా వేణు స్వామి తో దిగిన పోస్టులను అప్లోడ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసింది. ఇది చూసిన నెటిజెన్స్ ‘ఈయనని ఎప్పుడు కలిసావు..? ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి, మీ మధ్య ఇంత బాగోతం జరిగిందా’ అంటూ కామెంట్స్ చేసారు. బిగ్ బాస్ షో ద్వారా లేడీ టైగర్ గా పేరు తెచ్చుకొని చివరి వారం వరకు కొనసాగిన కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఇనాయ సుల్తానా, బిగ్ బాస్ షో తర్వాత ఏమైందో ఎవరికీ తెలియడం లేదు.
ఆమెకి అటు సినిమాల్లోనూ, ఇటు సీరియల్స్ లోను ఆఫర్స్ రావడం లేదు. తన జాతకం లో ఏదైనా దోషం ఉందేమో అని భయపడి వేణు స్వామి తో పూజలు చేయించుకుందట. అప్పటి నుండి కూడా ఆమె జాతకం లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నెటిజెన్స్ అనవసరం గా అతన్ని నమ్మి డబ్బులు నష్టపోవద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.