Venu Swamy : విజయ్ దేవరకొండ సినిమాలు అందుకే హిట్ కావట్లేదు.. వాటి వల్లే నాశనమయ్యాడంటున్న వేణు స్వామి

- Advertisement -

Venu Swamy : వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా మీద నెగిటివ్ పబ్లిసిటీ జరిగిందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగా ముందుగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో నెగిటివ్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున సినిమాని నష్ట పరిచిందని అన్నారు.

Venu Swamy
Venu Swamy

వాళ్ళని నెగిటివ్ పబ్లిసిటీ చేసి గుంటూరు కారం సినిమాని ఒక ఫెయిల్యూర్ అని చూపించారు. ఎందుకు నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు పెట్టారు. ఇది బేకార్ సినిమా అని చూడాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూస్ బయటకు వచ్చాయి. మీమ్స్ కి, ట్రోల్స్ కి, నెగిటివ్ రివ్యూస్ కి విజయ్ దేవరకొండ బలైపోయాడు.

- Advertisement -

ఈ సినిమా నాశనం అవ్వడానికి కారణాలు అవే ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందే నెగటివ్ రివ్యూస్ యూట్యూబ్లో హల్చల్ చేశాయి. సినిమా బాలేదు, బాలేదు, రాడ్ దించాడు రాడ్ దించాడు అంటూ నెగిటివ్ పబ్లిసిటీ చేయడంతో సినిమా చూడాలనుకున్న వాళ్లు కూడా చూడలేదు. అలా ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండకి పెద్ద నష్టమే జరిగింది. అంటూ వేణు స్వామి కామెంట్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here