Aishwarya Rajesh : క్రీమ్ కలర్ సూట్​లో ఐశ్వర్య రాజేశ్.. బాస్ లేడీ వైబ్స్​ ఇస్తున్న హీరోయిన్

- Advertisement -

Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేశ్.. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనలోని సత్తా ఏంటో నిరూపించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని దూసుకెళ్లింది. అయితే గత కొంతకాలంగా ఈ భామకు తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది. గ్లామర్​ను కాకుండా గ్రామర్​ను నమ్ముకున్న ఐశ్వర్య డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంది. దాదాపుగా తన పాత్రలన్నీ డీగ్లామర్​గానే ఉంటాయి.

Aishwarya Rajesh says 'religion was never a barrier' as she addresses  controversy surrounding Farhana | Interview - India Today

తాజాగా ఈ బ్యూటీ డియర్ అనే తమిళ్ సినిమాతో రానుంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది ఐశ్వర్య. ఇందులో భాగంగా తాజాగా క్రీమ్ కలర్ సూట్​లో ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ సూట్​లో ఐశ్వర్య చాలా అందంగా కనిపిస్తోంది. టోటల్ బాస్ లేడీ వైబ్స్ ఇస్తూ డామినేటింగ్​ పర్సనాలిటీతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య న్యూ లుక్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఈ సూట్​లో ఐశ్వర్య గ్లామరస్ పోజులిస్తూ మైమరిపించింది. ఓవైపు ఓర చూపుతో మరోవైపు డెడ్లీ లుక్​తో రచ్చ లేపుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఐశ్వర్య లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వెస్టర్న్ ఔట్​ఫిట్​లో ఐషూ చాలా అందంగా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఐషూకి ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్ మాత్రమే బాగుంటాయనుకున్నా.. వెస్టర్న్ వేర్​లో బ్యూటీ అదుర్స్ అంటూ కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. ఇక తమ ప్రేమనంతా ఎమోజీల రూపంలో కురిపించేస్తున్నారు.

ఇక ఐశ్వర్య సినిమాల సంగతికి వస్తే తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ వంటి సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తితో పాటు వరల్డ్ ఫేమస్ లవర్​లో సువర్ణ పాత్ర చాలా ఫేమస్ అయింది. ఈ సినిమాలో చాలా మంది ప్రేక్షకులకు నచ్చిన క్యారెక్టర్ ఐశ్వర్యదే. విజయ్ దేవరకొండను కూడా తన నటనతో ఐశ్వర్య ఈ చిత్రంలో డామినేట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here