Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.. వేణు స్వామి. సెలెబ్రిటీ హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు. జాతకాలు చెప్పడం దిట్ట. కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు మొదలుకుని హీరో- హీరోయిన్ల వరకూ అందరి తలరాతలను ఇట్టే చదివేస్తారనే పేరుంది. ఎన్నో జ్యోతిష్యాలన్నీ కూడా వేణు స్వామికి సెలెబ్రిటీ హోదాను తెచ్చి పెట్టాయి. దానికి అనుగుణంగా నిత్యం వార్తల్లోకెక్కుతుంటారు. తళుక్కున మెరుస్తుంటారు.
ఆయనను ఇంటర్వ్యూ చేసే యూట్యూబ్ ఛానళ్లకు లెక్కే లేదు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనీ అంచనా వేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు వేణు స్వామి. తాజాగా తన భార్య, ప్రముఖ వీణ విద్వాంసురాలు వీణా శ్రీవాణితో కలిసి చేసిన రీల్స్ వైరల్‌గా మారాయి. జ్యోతిష్యుడిగా కనిపించే వేణు స్వామి ఇందులో పూర్తి డిఫరెంట్ గెటప్‌లో దర్శనం ఇచ్చారు.
మోడ్రన్ సెయింట్‌గా కనిపించారు. మిర్చీ సినిమాలో ప్రభాస్- అనూష్క శర్మ మధ్య సాగే ఓ రొమాంటిక్ సన్నివేశానికి రీమేక్ చేశారు వేణు స్వామి దంపతులు. చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణు స్వామి పలికిన డైలాగ్‌కు వీణా శ్రీవాణి చిలిపిగా కౌంటర్ ఇచ్చారీ రీల్‌లో. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అందరూ వేణు స్వామిలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అవాక్కవ్వుతున్నారు.